పాకిస్తాన్ పై భారత్ యుద్ధంలో మనకు తెలియని రహస్యాలు: డిస్కవరీలో- పూస గుచ్చినట్లు

ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. గత ఏడాది ఏప్రిల్ 23వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు అసువులు బాశారు. వారిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని ప్రకటించాయి. పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టాయి.

ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది అప్పట్లో. పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. అక్కడితో ఆగలేదు. పాకిస్తాన్‌పై ప్రతీకార యుద్ధానికి దిగింది భారత్.

Discovery Channel India Announces Declassified Operation Sindoor Premiering Aug 15 88-Hour Response

జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడిని తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్‌ చేపట్టింది. రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్ వంటి నగరాలపై విరుచుకుపడింది. భారత్ మిస్సైళ్ల దాడులతో రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారక్కడి జనం. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. లాహోర్, సియాల్ కోట్ వంటి నగరాలు క్రమంగా ఖాళీ అయ్యాయి. ప్రత్యేకించి- సియాల్ కోట్. దాదాపుగా ఏడున్నర లక్షల మంది వరకు జనాభా ఉండే ఈ సిటీ ఖాళీ అయింది.

వంటగ్యాస్ సిలిండర్ల రేట్లపై కేంద్రం భారీ ఊరట
వంటగ్యాస్ సిలిండర్ల రేట్లపై కేంద్రం భారీ ఊరట

ఇప్పుడు ఇవన్నీ కూడా మరోసారి మన కళ్లముందుకు రాబోతోన్నాయి. ఆపరేషన్ సింధూర్ పై చిత్రీకరించిన ఓ డాక్యుమెంట్ త్వరలో విడుదల కాబోతోంది. డిక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్.. అనేది దీని టైటిల్. ఆగస్టు 15వ తేదీన రాత్రి 9 గంటలకు ఫస్ట్ పార్ట్ టెలికాస్ట్ అవుతుంది. 10 గంటలకు రెండో భాగం ప్రసారమౌతుంది. అప్పట్లో ఉత్కంఠభరితంగా సాగిన సైనిక ఆపరేషన్, విశేషాలతో డిస్కవరీ ఛానల్ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది.

పండగ సీజన్ వేళ.. బంగారం కొనుగోలుదారులకు ఉపశమనం: అయినా
పండగ సీజన్ వేళ.. బంగారం కొనుగోలుదారులకు ఉపశమనం: అయినా

బయటి ప్రపంచానికి తెలియని కొన్ని రహస్యాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు. ఉత్తమ్- నితిన్ దీనికి దర్శకత్వం వహించారు. నిక్కీ విక్కీ భగ్నాని ఫిల్మ్స్, ది కంటెంట్ ఇంజినీర్ దీన్ని దీన్ని నిర్మించాయి. దాదాపు 88 గంటల పాటు నిరంతరాయంగా సాగిన ఈ సుదీర్ఘ యుద్ధానికి సంబంధించిన తెరవెనుక పరిణామాలను ఈ డాక్యుమెంటరీ సిరీస్ విపులంగా ప్రదర్శించనుంది.

దేశ రక్షణ రంగానికి చెందిన ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో శత్రువులతో నేరుగా పోరాడిన అప్పటి సైనికులు, రక్షణ రంగ విశ్లేషకులు, ఆ సమయంలో రిపోర్టింగ్ చేసిన సీనియర్ జర్నలిస్టుల ప్రత్యక్ష అనుభవాలను ఇందులో పంచుకోనున్నారు. పహల్గామ్ దాడి తర్వాత భారత బలగాలు ఎలా స్పందించాయనేది ఇందులో చూడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+