ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ..

పాకిస్థాన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడు మరో పిడుగు పడింది. తమ వద్ద తీసుకున్న 3 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 2.79 లక్షల కోట్లు కట్టాలని యూఏఈ డిమాండ్ చేసింది. అప్పు తీర్చేందుకు గడువు కాలాన్ని పొడిగించాలని ప్రాధేయపడినా యూఏఈ అందుకు అంగీకరించలేదు. దాంతో పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేపట్టడంతో ప్రతీకారంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసి వేసింది. దాంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో మునిగిపోయాయి. ప్రపంచ దేశాలతోపాటు పాకిస్థాన్ కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆ దేశ ఆర్థిక పరిస్థితి పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అనేక ఇబ్బందులు వచ్చి పడ్డాయి.

ఇదే సమయంలో తమ వద్ద తీసుకున్న 3 బిలియన్ డాలర్లను వెంటనే చెల్లించాలని యూఏఈ వార్నింగ్ ఇవ్వడంతో పాకిస్థాన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో డబ్బు కోసం పాకిస్థాన్ ఆయా దేశాలు, అంతర్జాతీయ సంస్థలవైపు చూస్తున్నట్లు సమాచారం. ఇక ఐఎంఎఫ్ నుంచి దాదాపు 1.3 బిలియన్ డాలర్ల కోసం పాకిస్థాన్ ఎదురుచూస్తోంది. ఈ నిధులు ఐఎంఎఫ్ ఇస్తే పాకిస్థాన్ కు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.

Pakistan Plans First-Ever Loan in Chinese Currency Amid UAE Warning to Repay 3 Billion IMF Funds

అలాగే చరిత్రలో తొలిసారిగా చైనా కరెన్సీలో రుణం తీసుకోవాలని పాకిస్థాన్ చూస్తున్నట్లు స్పష్టం అవుతోంది. దీనికోసం పాకిస్థాన్ పాండా బాండ్లను జారీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లకు దూరంగా ఉన్న పాకిస్థాన్.. ఇప్పుడు మళ్లీ ఆ రూట్ లో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూరో బాండ్లు, ఇస్లామిక్ బాండ్ల ద్వారా నిధులు సేకరించాలని యత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో పాకిస్థాన్ త్వరలోనే యూఏఈకు నిధులు ఇవ్వకపోతే పాకిస్థాన్ దివాలా తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+