సడెన్ గా ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ మూవీ.. ఇప్పుడే చూసేయండి..!
కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ సినిమా వస్తుందంటే చాలు యూత్ ఫుల్ జోష్ లో ఉంటారు. లవ్ టుడ్, డ్రాగన్, డ్యూడ్ లాంటి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ ఇటీవల LIK మూవీతో ప్రేక్షకుల్ని అలరించాడు. LIK మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే విలక్షణ నటుడు, దర్శకుడు ఎస్. జె. సూర్య ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్రను పోషించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ప్రదీప్ రంగనాథన్ మిగతా సినిమాలతో పోల్చితే ఈ మూవీ కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి.
నెగటివ్ టాక్ తోనూ ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దాదాపు రూ. 60 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టింది. అయితే ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలు డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో పోల్చితే ఈ మూవీ కలెక్షన్స్ తక్కువే అని చెప్పాలి. ఇక LIK మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజ్ అయిన నెల రోజులకే ఈ మూవీ ఓటీటీలో ప్రత్యక్షమైంది. మార్చి 6 నుంచి ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు చిత్రం ఓటీటీ రిలీజ్ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మే 6 నుంచి ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు "పాత పద్ధతులు వర్సెస్ ఆధునిక రూల్స్ మధ్య జరిగే ఈ ప్రేమ యుద్ధం" అంటూ సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే 2040 నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అప్పటి టెక్నాలజీని చూపించారు. డేటింగ్ యాప్స్ ద్వారా పార్ట్ నర్స్ ను వెతుక్కునే కాలంలో.. సహజంగా ప్రేమలో పడాలని కోరుకునే ఓ యువకుడి ప్రయాణమే ఈ మూవీ లైన్.. థియేటర్లలో ఈ మూవీ మిస్ అయినవాళ్లు ఓటీటీలో ఓ లుక్ వేయండి..












Click it and Unblock the Notifications