భారత్‌ 'నరకం'. ఇండియన్స్ పై విషం కక్కిన ట్రంప్..

అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసిన ఒక వ్యక్తికి ఉండాల్సిన కనీస విజ్ఞతను డొనాల్డ్ ట్రంప్ గాలికి వదిలేశారు. తన రాజకీయ లబ్ధి కోసం భారత్ వంటి మిత్ర దేశాలను, కష్టపడి పైకొచ్చిన భారతీయులను కించపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన ఒక జాతివివక్షపూరిత లేఖను ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో రీ-పోస్ట్ చేయడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది.

భారత్ ఒక 'నరకం'.. సావేజ్ నోటి దూల!

అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వం (Birthright Citizenship) చట్టాన్ని రద్దు చేయాలన్నది ట్రంప్ పాత వాదన. దీనికి మద్దతుగా మైఖేల్ సావేజ్ రాసిన లేఖలో భారత్, చైనా వంటి దేశాలను "నరకం" (Hellholes) తో పోల్చారు. "చైనా, భారత్ వంటి నరకం నుంచి వచ్చే గ్యాంగ్‌స్టర్లు అమెరికాలో పుట్టిన తమ బిడ్డల ద్వారా పౌరసత్వం పొంది, మొత్తం కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు" అంటూ సావేజ్ విషం చిమ్మారు. ఇంతటి నీచమైన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థిస్తూ పోస్ట్ చేయడం ఆయన అహంకారానికి పరాకాష్టగా నిలుస్తోంది.

Trump s Arrogance Shares Post Calling India a Hellhole and Indians Laptop-Bearing Gangsters
US వీసాదారులకు ట్రంప్ షాక్: H1B ఉంటే గ్రీన్ కార్డ్ రానట్టే?
US వీసాదారులకు ట్రంప్ షాక్: H1B ఉంటే గ్రీన్ కార్డ్ రానట్టే?

భారతీయులు 'ల్యాప్‌టాప్ గ్యాంగ్‌స్టర్ల'ట!

అమెరికా ఆర్థిక వ్యవస్థను తమ మేధస్సుతో ముందుకు నడిపిస్తున్న భారతీయులను ఈ లేఖలో "ల్యాప్‌టాప్‌లతో ఉన్న గ్యాంగ్‌స్టర్‌లు" గా వర్ణించడం గమనార్హం. భారతీయులు, చైనీయులు తొమ్మిదో నెలలో కేవలం పౌరసత్వం కోసమే అమెరికా వస్తారని, దీనిని 'బర్త్ టూరిజం' గా వారు అభివర్ణించారు. అమెరికా పతాకాన్ని భారతీయులు తొక్కివేస్తున్నారని, ఈ ఆధునిక వలసల వల్ల అమెరికా రాజ్యాంగం కాలం చెల్లిపోయిందని అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భారత్ కు అమెరికా భారీ గుడ్ న్యూస్.. రూ. 11 లక్షల కోట్లు రీఫండ్..!!
భారత్ కు అమెరికా భారీ గుడ్ న్యూస్.. రూ. 11 లక్షల కోట్లు రీఫండ్..!!

కడుపు మంట పుట్టిస్తున్న ట్రంప్ ధోరణి..

భారతదేశాన్ని ఒక 'నరకం' అని పిలవడం, భారతీయులను నేరగాళ్లుగా చిత్రించడం ద్వారా ట్రంప్ తన అసలు నైజాన్ని బయటపెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్, మెడిసిన్, అంతరిక్ష రంగాల్లో భారతీయులు అగ్రస్థానంలో ఉంటే.. వారిని 'గ్యాంగ్‌స్టర్లు' అని పిలవడం ట్రంప్ అజ్ఞానమా లేక అహంకారమా అని ప్రవాస భారతీయులు మండిపడుతున్నారు.

ఎన్నికలు వస్తున్నప్పుడల్లా భారతీయుల ఓట్లు కావాలని కోరుకునే ట్రంప్, తెర వెనుక మాత్రం భారతీయుల పట్ల ఇంతటి ద్వేషాన్ని పెంచుకోవడం ఆయన ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. మిత్ర దేశాన్ని 'నరకం' అని పిలిచిన వ్యక్తిని భారత సంతతి ఓటర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+