రేపటినుంచే "అమర్‌నాథ్ యాత్ర".. తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి..?

అమర్ నాథ్ యాత్ర రేపటినుంచే ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారిని యాత్రలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. జూలై 3 నుంచి ఆగస్ట్ 28 వరకు 57 రోజులపాటు జరిగే ఈ యాత్రలో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది పాల్గొననున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని హిమాలయ పర్వత శ్రేణిలో దాదాపు 12,750 అడుగుల ఎత్తులో ఈ అమర్నాథ్ గుహ ఉంది. ఇక్కడ ప్రకృతి కారణంగా సహజసిద్ధంగా ఏర్పడిన అమర్ నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఈ యాత్ర సాగుతుంది.

ఇక అమర్ నాథ్ ను చేరుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ మార్గం. శ్రీనగర్ నుంచి దాదాపు 140 కిలోమీటర్లు ఉంటుంది. నడిచేందుకు దాదాపు 5 రోజుల సమయం పడుతుంది. ఇక రెండో మార్గం బల్తాల్.. ఇక్కడి నుంచి తక్కువ సమయంలోనే అమర్ నాథ్ చేరుకోవచ్చు. కానీ ఈ మార్గం చాలా క్లిష్టతరంగా ఉంటుంది. బల్తాల్ నుంచి అమర్ నాథ్ గుహకు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ జర్నీని ఒకే రోజులో పూర్తి చేసే అవకాశం ఉంది.

యాత్రలో పాల్గొనాలనుకునే భక్తుల వయసు 13 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే చిన్నారులు, వృద్ధులను యాత్రకు అనుమతించరు. వీరితోపాటు ప్రెగ్నెంట్ మహిళలకు కూడా యాత్రలో ప్రవేశం లేదు. ఇక ఈ యాత్రలో పాల్గొనాలని అనుకునేవారు శ్రీ అమర్ నాథ్ ఆలయ బోర్డు అఫీషియల్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలి. యాత్రకు వెళ్లేటప్పుడు అవసరమైన గుర్తింపు కార్డులను తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

AmarnathYatra Begins Tomorrow How to Reach from Telugu States Complete Guide Amarnath Yatra

ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి..? అంటే ముందుగా సికింద్రాబాద్ లేదా వైజాగ్ నుంచి జమ్ముతావికి వెళ్లే రైళ్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. జమ్ముతావిలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి గవర్న్ మెంట్ బస్సులు, ప్రేవేట్ వాహనాలలో పహల్గామ్ లేదా పంచతరణికి హెలికాప్టర్లు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+