కనిపించిన నౌకను కాల్చేయండి: అమెరికా నేవీకి ట్రంప్ సంచలన ఆదేశాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇటీవల ఇరాన్- అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం మరింతగా పెరిగింది. తాజాగా హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో ఈ జలసంధి వద్ద అమెరికన్ నేవీ తమ కార్యకలాపాలను విస్తృతం చేయాలని ఆదేశించారు. హార్మూజ్ ను దిగ్బంధిస్తున్న ఇరాన్ బోట్లను కాల్చివేయాలని ఈ మేరకు ట్రంప్ కీలక ఆర్డర్స్ ఇచ్చారు. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పశ్చిమాసియాలో ఇరాన్- అమెరికా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. హార్మూజ్ జలసంధి విషయంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధిలో మైన్లు పెడుతున్న ఇరాన్ కు చెందిన చిన్న బోట్లను కాల్చేయాలని అమెరికా నేవీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. చిన్న బోట్ల ఏరివేతను మూడింతలు వేగవంతం చేయాలని అమెరికా నేవీకి ఆదేశాలిచ్చినట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. అమెరికాకు చెందిన సముద్ర మైన్ స్వీపర్స్ ఆ పనిని వేగవంతంగా చేస్తున్నట్లు తెలిపారు. ఓ వైపు ఇరాన్- అమెరికా మధ్య రెండో రౌండ్ చర్చలు జరగాల్సిన నేపథ్యంలో ట్రంప్ కామెంట్స్ ఆందోళనను పెంచుతున్నాయి.

" హార్మూజ్ లో ఇబ్బందులు సృష్టిస్తున్న ఇరాన్ కు చెందిన చిన్న బోట్లను కనిపించిన వాటిని కనిపించినట్లే కాల్చి నీటిలో ముంచేయమని నేను అమెరికా నేవీకి ఆదేశాలు ఇచ్చాను. ఇప్పటికే దాదాపు 159 చిన్న బోట్లను సముద్రం అడుగులోకి పంపించాం. ఇకపై ఈ ప్రక్రియను మూడింతలు వేగవంతం చేయాలని ఆదేశించాను. వీటిని కాల్చేయడంలో ఎలాంటి అనుమానాలు ఉండొద్దు. ఈ చిన్న బోట్లే హార్మూజ్ జలసంధిలో మైన్లు పెడుతున్నాయి. అమెరికాకు చెందిన సముద్ర మైన్ స్వీపర్లు హార్మూజ్ ను శుభ్రం చేస్తున్నాయి" అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ఇక అంతర్జాతీయ చమురు రవాణాకు ఆటంకం కలగకుండా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.

Trump Orders U S Navy to Shoot and Kill Iranian Boats Laying Mines in the Vital Strait of Hormuz

ఇక ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురు, గ్యాస్ లో దాదాపు 20 శాతం ఈ హార్మూజ్ జలసంధి గుండానే వెళ్తుంది. హార్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయి. మరోవైపు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య రెండో రౌండ్ చర్చలు ప్రారంభం అవుతాయో.. లేదో.. తెలియని పరిస్థితి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+