సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం కాన్వాయ్.. షాకైన ప్రయాణికులు
ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తోందంటే చాలు.. గంటల ముందే రోడ్లు ఖాళీ చేయడం, కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను నిలిపివేయడం మనకు తెలిసిందే. కానీ, తెలంగాణలో ఇప్పుడు ఆ సీన్ మారింది. సామాన్య ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదన్న తన నిర్ణయానికి కట్టుబడి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు ఇతర వాహనాలతో పాటే సీఎం కాన్వాయ్ సాగడం నగరవాసులను ఆశ్చర్యపరిచింది.
తన రాక కోసం వాహనాలను నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని బుధవారమే సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి, ఉన్నత స్థాయి పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పనుల మీద వెళ్లేవారు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ముఖ్యమంత్రుల కాన్వాయ్ వల్ల గంటల తరబడి రోడ్లపై వేచి ఉండటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తున్న సమయంలో సీఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఎక్కడా పూర్తిగా నిలిపివేయలేదు.

సింగిల్ లేన్ విధానం.. మారిన ట్రాఫిక్ రూల్స్..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు కొత్త విధానాన్ని అమలు చేశారు. కాన్వాయ్ వెళ్లే సమయంలో రోడ్డును పూర్తిగా బ్లాక్ చేయకుండా, కేవలం ఒక లేన్‌ను మాత్రమే కాన్వాయ్ కోసం కేటాయించారు. మిగిలిన లేన్లలో సాధారణ వాహనాల రాకపోకలను యథావిధిగా అనుమతించారు. దీనివల్ల సీఎం కాన్వాయ్ సాఫీగా సాగిపోవడంతో పాటు, ట్రాఫిక్ ఎక్కడా స్తంభించలేదు.
ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజలకు సేవకులుగా ఉండాలే తప్ప, పాలకుల్లా ఇబ్బందులు సృష్టించకూడదనే సంకేతాన్ని ఈ చర్య ద్వారా సీఎం రేవంత్ రెడ్డి పంపారు.
Honourable Chief Minister Sri A. Revanth Reddy’s convoy travelled in regular traffic from Shamshabad Airport to his residence.
— IPRDepartment (@IPRTelangana) May 7, 2026
The Chief Minister Sri. A. @revanth_anumula had yesterday issued clear instructions to senior police officials against stopping vehicles across the… pic.twitter.com/9nxSh9Crnv













Click it and Unblock the Notifications