అర్ధరాత్రి బస్టాండ్‌లో ఒంటరిగా ఆమె.. చుట్టుముట్టిన కామ పిశాచులు

సమయం అర్ధరాత్రి 12 గంటలు. అరాచకాలకు అడ్డాగా మారిన దిల్ సుఖ్ నగర్ బస్టాండ్. గంజాయి బ్యాచ్‌లు, మద్యం మత్తులో తూగే పోకిరీల మధ్య ఒక మహిళా ఒంటరిగా బస్సు కోసం నిల్చుంది. చూస్తుంటే సగటు మధ్యతరగతి మహిళలా కనిపిస్తోంది కానీ, ఆ మఫ్టీ డ్రెస్ వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే అక్కడి ఆకతాయిల గుండెలు ఆగిపోవాల్సిందే. ఆమె మరెవరో కాదు.. ఆ రోజే బాధ్యతలు చేపట్టిన నూతన పోలీస్ కమిషనర్ సుమతి.

ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, కనీసం గన్‌మెన్లను కూడా వెంట తీసుకోకుండా సుమతి సాగించిన ఈ ఆపరేషన్ చూస్తుంటే గూస్‌బమ్స్ రాక మానవు. బస్టాండ్‌లో నిల్చున్న ఆమెను చూసి సుమారు 40 మంది పోకిరీలు చుట్టుముట్టారు. అందులో ఎక్కువ మంది గంజాయి, మద్యం మత్తులో ఉన్న విద్యార్థులే కావడం గమనార్హం. కమిషనర్ అని తెలియక వారు ఆమెపై అసభ్యకరమైన ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. వేధింపులు పరాకాష్టకు చేరినా, మొక్కవోని ధైర్యంతో సుమతి అక్కడే ఉండి ప్రతి ఒక్కరి ముఖాన్ని, వారి ప్రవర్తనను నిశితంగా గమనించారు.

Lady Singham in Action Commissioner Sumati Goes Undercover at Midnight to Bust Dilsukhnagar Eve-Teasers

పోలీసుల తీరుపై నిప్పులు

అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు అంటే ఏకంగా మూడు గంటల పాటు ఆపరేషన్ సాగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మూడు గంటల పాటు ఒక్క పెట్రోలింగ్ వాహనం కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. విధి నిర్వహణలో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో కమిషనర్‌కు ప్రత్యక్షంగా అర్థమైంది. చివరకు 3:30 గంటలకు అటుగా వచ్చిన బీట్ కానిస్టేబుల్ తీరును కూడా ఆమె గమనించారు.

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు..
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు..

40 మంది పోకిరీల ఆటకట్టు

వరుసగా మూడు రోజుల పాటు దిల్ సుఖ్ నగర్ ప్రాంతంపై స్వయంగా నిఘా పెట్టిన సుమతి, మొత్తం 40 మంది పోకిరీలను గుర్తించి అదుపులోకి తీసుకునేలా చర్యలు చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి కఠినమైన కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఎయిర్‌పోర్ట్‌లో దారుణం: చెకింగ్ పేరుతో విదేశీ మహిళపై లైంగిక వేధింపులు!
ఎయిర్‌పోర్ట్‌లో దారుణం: చెకింగ్ పేరుతో విదేశీ మహిళపై లైంగిక వేధింపులు!

"మహిళలకు రక్షణ కల్పించడమే నా మొదటి ప్రాధాన్యత. రాత్రి వేళల్లో సామాన్య మహిళ రోడ్డు మీదకు రావాలంటే భయపడకూడదు" అనే సంకేతాన్ని సుమతి ఈ ఆపరేషన్ ద్వారా బలంగా పంపారు. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఫీల్డ్ లోకి వెళ్లి అరాచక శక్తుల వెన్నులో వణుకు పుట్టించిన సుమతిని ఇప్పుడు అందరూ "లేడీ సింగం" అంటూ కొనియాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+