చివరకు పెళ్ళిళ్ళలోనూ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇప్పుడు అన్ని రంగాలను శాసిస్తోంది. ఇది అది అని తేడా లేకుండా ప్రతి వ్యవస్థలోనూ చొచ్చుకొని పోతుంది. ఇంతకుముందు పెళ్లి చేయాలంటే పెళ్లి ని ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా చేయాలి అనేది పెద్దలు ప్లాన్ చేసి చేసేవారు కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిచయమైన యాప్ లు పెళ్లిళ్ల రూపురేఖలను మార్చేస్తున్నాయి.

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత వెడ్డింగ్ యాప్స్

ఈ యాప్ లు పెళ్లి ఏ ప్రదేశంలో చేసుకుంటే బాగుంటుంది. పెళ్లికి సంబంధించిన థీమ్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది. ఎటువంటి వస్తువులు పెళ్లికోసం ప్రత్యేకంగా తెస్తే బావుంటుంది. పెళ్లిని ఏ విధంగా మెమొరబుల్ గా చేసుకోవాలి వంటి అనేక వ్యక్తిగతీకరించిన సూచనలను ఇస్తాయి. పెళ్లికి సంబంధించి బడ్జెట్లు, టైం లైన్ లను నిర్వహించడంలో కూడా సహాయపడతాయి. ఇవి వివాహ ప్రణాళికను సునాయాసంగా అమలు చేసేలా చేస్తాయి.

AI-Powered Wedding Planning Apps Revolutionising Planning In India

వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు

వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు అనుకున్న బడ్జెట్లో ఇవి సిఫార్సులను అందిస్తాయి. ఇందులో ప్రదేశం ఎంపిక నుండి, థీమ్ కు సంబంధించిన ఆలోచనలు ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. వ్యక్తిగత అభిరుచులను అర్థం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా బడ్జెట్లోనే ఇవి వెడ్డింగ్ ప్లానింగ్ ను ఇస్తాయి. వివాహ ప్రణాళికలో బడ్జెట్ అనేది ఒక ముఖ్యమైన కీలకమైన అంశం.

ఆర్థిక పరిమితులు పెళ్ళికి అడ్డు కాకుండా చేస్తాయి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఖర్చులను ట్రాక్ చేయడంతో పాటు, మనకు బడ్జెట్లో అనుకూలంగా ఉండడంలో వినియోగదారులకు సహాయపడతాయి. అవి నాణ్యతపైన ఎటువంటి రాజీ పడకుండా ఖర్చు తక్కువ అయ్యేలా సమర్థవంతమైన ప్రయత్నాలను అందిస్తాయి. ఆర్థిక పరిమితులు వేడుకకు ఇబ్బంది కలగకుండా సలహాలు ఇస్తాయి. వివాహ వేడుకలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి విక్రేత లతో సమన్వయం చేయడానికి కూడా పనిచేస్తాయి.

యాప్స్ ద్వారా నేరుగా సేవలు బుక్ చేసుకునే వీలు

యాప్ ద్వారా నేరుగా సేవలను బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తాయి. సమయాన్ని అలానే శ్రమను కూడా ఆదా చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వెడ్డింగ్ ప్లానింగ్ యాప్స్ మనం చేయాల్సిన ముఖ్యపనులు, వాటికి సంబంధించిన డెడ్ లైన్స్ అలర్ట్ లను కూడా పంపుతాయి. వివాహ పనులకు సంబంధించిన ప్లానింగ్ ను ఏమాత్రం తప్పకుండా సజావుగా సాగేలా చేస్తాయి. ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్లో ఏఐ ఆధారిత యాప్స్ కీలకభూమిక పోషిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+