టీసీఎస్, ఇన్ఫోసిస్ కు ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ దిమ్మతిరిగే షాక్..!
వాల్ స్ట్రీట్ దిగ్గజాలైన బ్లాక్‌స్టోన్, గోల్డ్‌మన్ శాక్స్‌లతో ఆంథ్రోపిక్ కుదుర్చుకున్న $1.5 బిలియన్ల కొత్త జాయింట్ వెంచర్ AI స్టార్టప్ ఏర్పాటు చేస్తున్న సంస్థ, కంపెనీలకు కృత్రిమ మేధ టూల్స్‌ను విక్రయించే సేవల కంపెనీగా పనిచేస్తుంది. ఆంథ్రోపిక్, బ్లాక్‌స్టోన్, హెల్‌మాన్ & ఫ్రైడ్‌మాన్, గోల్డ్‌మన్ శాక్స్‌లు ఈ వెంచర్‌లోని భాగస్వాములు. ఇది మధ్యస్థాయి కంపెనీలతో పని చేస్తూ, వారి కార్యకలాపాల్లో "క్లాడ్" (Claude) ఏఐ మోడళ్లను అంతర్లీనం చేసుకోనుంది. దీంతో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి సాస్ (SaaS) సంస్థలకు పెను సవాలు ఎదురుకాబోతోంది.
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం ఈ జాయింట్ వెంచర్‌లోని మొత్తం $1.5 బిలియన్ల పెట్టుబడిలో ఆంథ్రోపిక్, బ్లాక్‌స్టోన్, హెల్‌మాన్ & ఫ్రైడ్‌మాన్ ఒక్కొక్కటి $300 మిలియన్లు, గోల్డ్‌మన్ శాక్స్ $150 మిలియన్లు పెట్టుబడిగా పెట్టనున్నాయి. జనరల్ అట్లాంటిక్, లియోనార్డ్ గ్రీన్, అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్, జీఐసీ, సీక్వోయా క్యాపిటల్ వంటి సంస్థల కన్సార్టియం కూడా దీనికి మద్దతు ఇస్తుంది. దీంతో భారతీయ ఐటీ రంగానికి ఇది మరో 'సాస్‌పోకలిప్స్' కానుందా అనే చర్చ మొదలైంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సాస్ (SaaS) సంస్థలు ఉన్నా, ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐల (Anthropic and openai) ఈ కొత్త వెంచర్‌లు ఒత్తిడిని పెంచుతాయి. వాల్ స్ట్రీట్ మద్దతుతో, ఏఐ టూల్స్‌ను అవసరాలకు అనుగుణంగా సులువుగా అందించడం ద్వారా ఇది క్లయింట్ బేస్ విస్తరిస్తుంది.

తాజా పరిణామాలతో భారీతయ ఐటీ కంపెనీలకు ఎదురయ్యే ముప్పుపై ఆందోళనలు మొదలయ్యాయి. భారతీయ ఐటీ సేవల కంపెనీలు ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ దూకుడుతో అనూహ్య పోటీని ఎదుర్కోబోతున్నాయని కొందరు, భారతీయ ఐటీ సేవలకు ఇది దుర్వార్త అని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐల కొత్త కంపెనీలతో పోటీ కష్టమని నెటిజన్లు భావిస్తున్నారు. ఆంథ్రోపిక్ కొత్త జాయింట్ వెంచర్, మధ్యస్థాయి వ్యాపారాలతో సహా, వివిధ సంస్థలలో ఎంటర్‌ప్రైజ్ AI విస్తరణలను రూపొందించి, నిర్మించి, నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. క్లాడ్ ఏఐ ఎక్కడ అత్యధిక ప్రభావాన్ని చూపుతుందో గుర్తించడానికి, అనుకూల సాధనాలను రూపొందించడానికి ఆంథ్రోపిక్ ఇంజనీర్‌లతో నేరుగా కలిసి పనిచేస్తుంది.

ఆంథ్రోపిక్ ప్రకటనకు కొద్ది గంటల ముందు బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ప్రధాన ప్రత్యర్థి ఓపెన్‌ఏఐ కూడా ఇలాంటి సంస్థపై పనిచేస్తోంది. 'ది డెవలప్‌మెంట్ కంపెనీ' కోసం నిధులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇది $10 బిలియన్ల విలువతో 19 పెట్టుబడిదారుల నుండి $4 బిలియన్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టిపిజి, బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్, అడ్వెంట్, బైన్ క్యాపిటల్ వంటి ప్రముఖ పెట్టుబడిదారులు ఇందులో ఉన్నారు. ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ మద్దతు ఉన్న వెంచర్‌ల మధ్య పెట్టుబడిలో అతివ్యాప్తి లేదని నివేదిక పేర్కొంది. రెండు కంపెనీలు ఎంటర్‌ప్రైజ్ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నాయి. సామర్థ్యాన్ని పెంచడానికి, ఖర్చులను తగ్గించడానికి ఒత్తిడిలో ఉన్న ప్రైవేట్ ఈక్విటీ మద్దతు ఉన్న కంపెనీలు ఆకర్షణీయమైన లక్ష్యాలు. ఈ మార్కెట్‌లో ఆంథ్రోపిక్ నాయకుడిగా ఉన్నా, ఓపెన్‌ఏఐ దానిని అధిగమించడానికి ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications