సాఫ్ట్ వేర్ కంపెనీలకు డూమ్స్ డే ఫిక్స్ ? తేల్చేసిన ఆంత్రోపిక్ సీఈవో..!
కృత్రిమ మేథ (AI) దూకుడు కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఆంథ్రోపిక్ సీఈఓ (Anthropic CEO) డారియో అమోడీ (Dario Amodei) మరోసారి తేల్చిచెప్పేశారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సాఫ్ట్‌వేర్ భవిష్యత్తులో "చవకగా, బహుశా ఉచితంగా" మారబోతోందని ఆయన హెచ్చరించారు. కృత్రిమ మేధస్సు దూకుడు కారణంగా కోడింగ్ ఆధారిత ఉద్యోగాలు, కెరీర్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అమోడీ స్పష్టం చేశారు. ఈ మార్పులకు సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
2026లో అమోడీ.. AI వల్ల ఎంట్రీ-లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని పలు వేదికలపై ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన దృష్టి సాఫ్ట్‌వేర్ డెవలపర్లపై పడింది, వారికీ పరిస్థితి అంత అనుకూలంగా లేదని హెచ్చరించారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ధర "దాదాపు సున్నా"కి చేరుకుంటుందని, దాన్ని తయారు చేసే ఉద్యోగాలు రాబోయే కొన్నేళ్లలో మనుగడ సాగించలేకపోవచ్చని పేర్కొన్నారు. లక్షలాది మంది వినియోగదారుల కోసం ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాల్సిన అవసరం అనే భావన తప్పు కావచ్చన్నారు. ఒక సమావేశం కోసం తయారు చేసి, కొన్ని సెంట్లు ఖర్చు చేసి, ఒకసారి ఉపయోగించి, తరువాత పారవేసే యాప్‌ను ఆయన ఉదాహరణగా చూపారు. "ఇది చాలా సౌకర్యవంతంగా, రీసైకిల్ చేయదగినదిగా మారవచ్చన్నారు.

అమోడీ దృక్పథం ప్రకారం, పాత సాంకేతికతల కంటే ఏఐ ఉత్పాదకతను వేగంగా పెంచుతోంది. ఏఐ వల్ల వచ్చే ఈ ఉత్పత్తి ఉప్పెనలో "దశాబ్దాలుగా నిర్మించుకున్న మొత్తం ఉద్యోగాలు, మొత్తం కెరీర్లు" మనుగడ సాధించకపోవచ్చని ఆయన తెలిపారు. ఈ పరిణామాలకు సమాజం అనుగుణంగా మారగలదని విశ్వసించినా, చాలామందికి రాబోయే మార్పుల తీవ్రతపై అవగాహన లేదని అమోడీ ఆందోళన చెందారు. "ఏమి వస్తోంది, దాని పరిమాణం ఏమిటి అనే దాని గురించి అసలు అవగాహన ఉందని తాను అనుకోవడం లేదన్నారు.

మార్కెట్‌లు ఇప్పటికే ఈ పరిణామాలకు స్పందిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి సర్వీస్‌నౌ షేర్లు 39% పడిపోయాయి. స్నోఫ్లేక్ 35% నష్టం చవిచూడగా, థామ్సన్ రాయిటర్స్ 28% కోల్పోయింది. తన 365 సూట్‌లో కోపైలట్‌ను అందిస్తున్న మైక్రోసాఫ్ట్ షేర్లు జనవరి నుండి 15% తగ్గాయి. ఇది సాఫ్ట్‌వేర్ రంగంలో వస్తున్న మార్పులకు నిదర్శనంగా నిలుస్తోంది. అమోడీ ఈ హెచ్చరికలు ఆంథ్రోపిక్ యొక్క ప్రస్తుత పనితీరుకు కూడా సరిపోతాయి. ఆంథ్రోపిక్ 900 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అంచనా విలువతో ప్రైవేట్ రౌండ్‌ను ముగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. వార్షిక ఆదాయం 40 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఈ భారీ విలువకు క్లాడ్ (Claude) కేవలం ఉత్పాదకత సాధనం మాత్రమే కాదు, విజ్ఞాన కార్మికుల ప్రపంచ వేతన బిల్లుకు ప్రత్యామ్నాయమని ఇన్వెస్టర్‌లు నమ్మాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications