Bill Gates: ఎఫ్ స్టీన్ ఫైల్స్ వేళ ఏఐ సదస్సుకు బిల్ గేట్స్-ఉత్కంఠపై క్లారిటీ..!
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (bill gates) తాజాగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వెళ్లారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏపీలోనే ఉన్న ఆయన.. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (AI Impact Summit)కు కూడా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఉన్నట్లుండి ఆయన ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు రావడం లేదని ఆయన టీమ్ చెప్పినట్లు ఓ ప్రచారం మొదలైంది. దీంతో ఉత్కంఠ పెరిగింది. ఈ నేపథ్యంలో టీమ్ కొద్దిసేపటి క్రితం దీనిపై క్లారిటీ ఇచ్చేసింది.
తాజాగా అమెరికాలో బయటపడిన ఎప్ స్టీన్ ఫైల్స్ వివాదం నేపథ్యంలో బిల్ గేట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఏఐ సదస్సుకు వచ్చేందుకూ ఆయన ఇష్టపడట్లేదని ప్రచారం జరిగింది. ఎప్ స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ కు రష్యా మహిళలో అక్రమ సంబంధాలు ఉండేవని, ఈ కారణంగా సుఖవ్యాధులకు గురైన ఆయన.. తన భార్యకు అవి సంక్రమించకుండా వ్యాక్సిన్లు కూడా ఇచ్చేవారని బయటపడింది. ఈ వివాదం కారణంగానే తాను బిల్ గేట్స్ కు విడాకులు ఇచ్చేసినట్లు ఆయన మాజీ భార్య మిలిందా కూడా వెల్లడించారు. దీంతో ఆన్ లైన్ లో బిల్ గేట్స్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో ఆయన ముందుగానే ప్లాన్ చేసుకున్న భారత్ టూర్ కు వచ్చారు.

ఇందులో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి సీఎం చంద్రబాబుతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిల్ గేట్స్ కు ఆతిధ్యమిచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపైనా ఆన్ లైన్ లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సుకు హాజరైతే ఎప్ స్టీన్ ఫైల్స్ ప్రభావం కచ్చితంగా తనపై ఉంటుందని భావించిన బిల్ గేట్స్ దూరంగా ఉండిపోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని బిల్ గేట్స్ టీమ్ ఖండించింది. ఆయన షెడ్యూల్ ప్రకారమే ఈ సదస్సుకు హాజరువుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఉత్కంఠకు బ్రేక్ పడింది.












Click it and Unblock the Notifications