హైద‌రాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంట‌ర్..ప్రారంభ వేళ సీఎం కీలక ప్రకటన

ఇండియాలో డిజిటల్ సేఫ్టీ కోసం గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు గూగుల్ తెలిపింది. ఆసియా పసిఫిక్ లో తొలి సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయగా..సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. ఇండియా డిజిటల్ జర్నీ శరవేగంగా ప్రయాణిస్తుందని, ఈ క్రమంలోనే వినియోగదారులకు భద్రత చాలా ముఖ్యమని గూగుల్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎదురయ్యే సరికొత్త సవాళ్లను నైతికంగా డిజిటల్ లైఫ్ లో అధిగమించడమే ధ్యేయంగా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని గూగుల్ స్పష్టం చేసింది.

ఇండియాలో గూగుల్ తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటుందని గూగుల్ సేఫ్టీ ప్రతినిధి ప్రీతి లోబన తెలిపారు. హెల్పింగ్ , ఎంపవరింగ్ ఇండియా, రీ-ఇమాజిన్, ట్రస్ట్ అనే నాలుగు మూల స్తంభాలపై గూగుల్ తన ప్రయాణాన్ని సాగిస్తుందన్నారు. బ్యాంకింగ్ రంగంలో మోసాలు బాగా పెరుగుతున్నాయని, ఈ క్రమంలోనే భారత ప్రజలకి సాయం కావాలని, అందుకోసమే గూగుల్ నిలబడిందని స్పష్టం చేశారు. డిజిటల్ ని అలవాటు చేసుకుంటున్న భారతీయులకు అత్యవసర సాయం కోసం గూగుల్ సేఫ్టీ నిలబడుతుందన్నారు.

CM Revanth Reddy inaugurates Google safety engineering centre at Hyderabad

వికసిత భారత్ లో భాగంగా గూగుల్ కూడా భారత్ తో చేయి కలిపి ముందుకు సాగుతుందని తెలిపారు. గూగుల్ నుంచి యూ ట్యూబ్ దాకా , మ్యాప్స్ నుంచి పేమెంట్స్ దాకా విస్తరించిన తరుణంలో.. ఏఐ మనల్ని మోసగాళ్ల నుంచి బయటపడేస్తుందని అందుకు కావాల్సిన సాయం అంతా గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ద్వారా అందిస్తామన్నారు. ఇపుడు ఏఐతో పాటు దాని ద్వారా జరిగే మోసాల నుంచి సామాన్య ప్రజలను బయటపడేయడమే ప్రధాన లక్ష్యం అని వివరించారు.

జీశాక్ ద్వారా మరో మైలు రాయిని దాటిన తెలంగాణ - శ్రీధర్ బాబు

విజనరీ లీడర్ రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ఐటీ దూసుకుపోతుందన తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ రోజు జీశాక్ (GSEC) ద్వారా మరో అడుగు ముందుకు వేశామన్నారు. సైబర్ నేరాల నిరోధకంలో మరి మైలు రాయిని అధిగమించడం గర్వంగా ఉందన్నారు. మనమంతా గూగుల్ వాడుతున్నాం కానీ కొంతమంది నేరగాళ్లు టెక్నాలజీతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. డీప్ ఫేక్ పేరిట ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలు చేయాల్సింది పోయి అనర్థాలకు దారి తీస్తున్న తరుణంలో నైతికంగా సైబర్ నేరాలు నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆసియా పసిఫిక్స్ లో తొలి కేంద్రం హైదరాబాద్ లో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విలువలకు, విశ్వసనీయతకు ఇండియా పుట్టినిల్లని, తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రగతి దిశగా ముందుకు సాగుతుందని వెల్లడించారు.

CM Revanth Reddy inaugurates Google safety engineering centre at Hyderabad

గూగుల్ ప్రస్థానంలో వైఎస్ఆర్ చెరగని ముద్ర.. - సీఎం

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గూగుల్ ఇన్నోవేషన్ కంపెనీ, మాది ఇన్నోవేషన్ గవర్నమెంట్ అని పేర్కొన్నారు. గూగుల్ సెఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (Google safety engineering center) తెలంగాణ లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గూగుల్ రాకతో ప్రపంచం మారిపోయిందని, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి ఈ రోజు అందరం మాట్లాడుకుంటున్నామన్నారు. గూగుల్ కి నైతిక విలువలు ఎక్కువ అని కొనియాడారు. గ్లోబల్ పెట్టుబడులకి తెలంగాణ తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నామని, 2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పని చేస్తుందన్నారు. గూగుల్ ఆఫీస్ కంటే ఎక్కువ స్థలంలో రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల కోసం, తెలంగాణ మహిళ ల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సోలార్ పవర్ జనరేషన్ , మహిళలకు ఫ్రీ బస్ రూపంలో భారీ ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వానికి మీ సాకారం కావాలిని గూగుల్ ప్రతినిధులను కోరారు. గూగుల్ ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ కి పరిచయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారు తీసుకువచ్చిన సంస్థలను తమ ప్రభుత్వం కావల్సినంత సహకారం అందిస్తూ మరింత ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.

CM Revanth Reddy inaugurates Google safety engineering centre at Hyderabad

జీహెచ్ఎంసీలో ట్రాన్స్ జెండర్లు..

ట్రాఫిక్ పోలీస్ ల రూపంలో ట్రాన్స్ జెండర్ లను పెట్టి ఇన్నోవేషన్ కి అర్థం చెప్పామని వివరించారు. ముందున్న రోజుల్లో జీహెచ్ఎంసీలో కూడా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఏటా 1,10,000 మంది ఇంజనీర్లు ప్రతి ఏడాది బయటకు వస్తున్నారని, కానీ ఆ స్థాయిలో ఉద్యోగాలు లేవన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామితో ఉపాధి కల్పన చేద్దామని కోరారు. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+