'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్ రేపే.. దేవి శ్రీ ప్రసాద్ లుక్స్ కు గూస్ బంప్స్ పక్కా..!

'బలగం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు దర్శకుడు వేణు యెల్దండి. ఇప్పుడు ఆయన 'ఎల్లమ్మ' అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో 'పర్షి' అనే పాత్రలో ప్రముఖ మ్యుజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా నటిస్తున్నారు. దాంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ఇక ఈ మూవీ నుంచి దేవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆగస్టు 2 న చిత్ర యూనిట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. హీరోగా దేవీశ్రీ ప్రసాద్ ఇదే సినిమాతో పరిచయం కానున్నారు. ఈ సినిమాలో నటించనున్న నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఎల్లమ్మ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఒక నిమిషం 59 సెకన్ల పాటు ఉన్న ఈ గింప్స్ తో దర్శకుడు వేణు యెల్దండి మరోసారి ఆశ్యర్యపరిచారు.

ఇక రేపు రిలీజ్ కానున్న ఫస్ట్ లుక్ తో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. మొత్తానికైతే ఈ మూవీ నుంచి చాలా రోజుల తర్వాత ఓ అప్డేట్ రావడం శుభపరిణామంగా భావించవచ్చు. ఈ మూవీలో హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న ప్రశ్న చాలా రోజులు ఉత్పన్నమైంది. భాగ్యశ్రీ బోర్సే, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేశ్, సాయి పల్లవి ఇలా అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. కానీ వీటిపై అధికారిక ప్రకటన ఇప్పటివరకూ రాలేదు. ఇక ఎల్లమ్మ మూవీలో కథానాయిక పాత్ర చాలా ముఖ్యమైనదిగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

Yellamma Devi Sri Prasad first look drops tomorrow his look is guaranteed to give you goosebumps

ఇక ఎల్లమ్మ చిత్రంలో ఓ పక్క హీరోగా నటిస్తూనే మరోవైపు స్వరాలను సమకూరుస్తున్నారు దేవీశ్రీ ప్రసాద్. ఈ మూవీ తెలుగులో మరో కాంతార అవుతుందని పలువురు విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. బలగం సినిమాకు మించిన విజయాన్ని ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో వేణు యెల్దండి అందుకుంటారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+