ఏఐతో డీప్ ఫేక్ చిత్రాలను ప్రచారం చేస్తే జైలుకే..
డెన్మార్క్.. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఒకటిగా పేరొందింది. అక్కడే అమలయ్యే చట్టాలు కూడా అంతే పకడ్బందీగా ఉంటాయి. అందుకే ఆ దేశంలో క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో డిజిటల్ సాంకేతికత పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం క్రమ క్రమంగా పెరిగిపోతోంది.
ఈ నేపథ్యంలో కొందరు సైబర్ నేరగాళ్లు ఏఐ ను వినియోగించి మహిళల డీప్ ఫేక్ చిత్రాలను రూపొందించి ఇంటర్నెట్ లో ప్రచారం చేస్తున్నారు. అయితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం పెరిగిపోయింది. ఏఐ అన్ని రంగాలను శాసిస్తోంది. ఈ క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్లు ఏఐ ను వినియోగించి మహిళల భద్రతకు ఆటంకం కలిగిస్తున్నారు. మహిళల వ్యక్తిగత హక్కలను హరిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెన్మార్క్ దేశం కీలక చట్టం రూపొందించింది.

ఎవరికైనా తమ శరీరం, ముఖం, వాయిస్.. తదితర వాటిపై వ్యక్తిగత హక్కులు ఉంటాయి. వీటిని ఎవరూ కూడా డిజిటల్ మాధ్యమాల ద్వారా మార్చే అధికారం లేదని పేర్కొంది. అలా ఏఐను వినియోగించి డీప్ ఫేక్ చిత్రాలను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అలాంటి వారిని చట్టం పరంగా జైలుకు తరలిస్తామని పేర్కొంది.












Click it and Unblock the Notifications