ఏఐని ఈ ఐదు విషయాలు అడగొద్దు.. అడిగితే మీకే రిస్క్!
కృత్రిమ మేధస్సు (AI) ఇప్పుడు మానవ జీవితాలను శాసిస్తున్న విషయం తెలిసిందే. ఏ చిన్న అవసరం ఉన్నా, ఏ విషయం తెలుసుకోవాలి అనుకున్నా ఏఐ మీద ఆధార పడుతున్నారు చాలామంది. ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కారణంగా, అది చెప్పింది నిజమని నమ్ముతున్న వారు కూడా లేకపోలేదు.
ఈ విషయాలని ఏఐని అడగొద్దు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పటికే డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి మీకు అందిస్తుంది తప్ప ఖచ్చితమైన సమాచారాన్ని అందించదు. అన్ని సందర్భాలలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది కరెక్ట్ కాదు. అందుకే ముఖ్యమైన కొన్ని విషయాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అడగకుండానే ఉంటే మంచిదని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ ముఖ్యమైన ఐదు విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

ఆరోగ్య సలహాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరోగ్య సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తున్న కారణంగా, దానికి అన్ని విషయాలు తెలుసని భావించి ఆరోగ్యానికి సంబంధించిన సలహాలను, సూచనలను అడగకూడదు. ఒకవేళ అది చెప్పిన సలహాలు, సూచనలు పాటిస్తే ఒక్కోసారి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అడిగి మందులు వేసుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రోగాలకు ట్రీట్మెంట్ నేరుగా చేసుకోవడం వంటివి చేస్తే అనవసరపు రిస్క్ లను ఫేస్ చేయాల్సి వస్తుంది.
న్యాయపరమైన సలహాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను న్యాయసలహాలు అడగడం మంచిది కాదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యాయ సలహాల విషయంలో కూడా ఎక్స్పర్ట్ కాదు. న్యాయ సలహాలు ఒక్కొక్క కేసును బట్టి ఒక్కో విధంగా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు న్యాయవాదిలాగా మీ కేసును మొత్తం స్టడీచేసి సలహా ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే న్యాయసలహాలు కచ్చితత్వంతో కూడుకున్నవి కావు. అందుకే న్యాయపరమైన సలహాలు అడగకుండా ఉంటేనే మంచిది.
వ్యక్తిగత విషయాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి కూడా సరైన సలహాలు, సూచనలు ఇవ్వలేదు. అది ఒక మనిషిలాగ సున్నితమైన భావాలను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా సమాధానాన్ని ఇవ్వలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మన ఎంటర్ చేసిన మేటర్ అంతా ఆయా కంపెనీల దగ్గర స్టోర్ అయి ఉంటుంది. ఇందులో గోప్యత ఆస్కారం లేదు కాబట్టి, వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఏ ఐ కు ఏమీ చెప్పకూడదు.
మానసిక సమస్యలు
మానసికంగా మనం పడుతున్నటువంటి ఘర్షణలు, ఆవేదనకు సంబంధించిన ప్రశ్నలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అడగకుండా ఉంటేనే మంచిది. ప్రేమరాహిత్యం, ప్రేమ వైఫల్యం, ఒంటరితనం, ఒత్తిడి వంటి కారణాలతో చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా తమ మానసిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు అయితే కొన్నిసార్లు ఇవి అనవసరపు రిస్కు లకు కారణంగా మారుతున్నాయి. మానసిక సమస్యలకు సంబంధించి పరిష్కారానికి ఏఐ ను ఆశ్రయించకూడదు.
ఆర్థిక లావాదేవీలు
ఇక ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో, స్టాక్ మార్కెట్లు తదితరాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో ఏఐ ను ఆశ్రయించకూడదు. కొన్ని రకాల సలహాలు, సూచనలు ఇచ్చినప్పటికీ పెట్టుబడుల విషయంలో భవిష్యత్తును ఏఐ నిర్ధారించలేదు .కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో ఏఐ మీద ఆధారపడకూడదు.












Click it and Unblock the Notifications