AIతో ఉద్యోగాల కోత ఉండదని తీపికబురు చెప్పిన దిగ్గజ బ్యాంక్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కీలక భూమిక పోషిస్తుంది. అన్ని రంగాలలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకుపోతుంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలోని అనేక సంస్థలు, దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫలితంగా కంపెనీలు భారీగా ఉద్యోగులను తీసి వేస్తున్నాయి.
ఉద్యోగులలో ఏఐ ఆందోళన
టెక్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 90 వేల మందికి పైగా ఉద్యోగులను ఇళ్లకు పంపేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా లే ఆఫ్స్ మరిన్ని ఉంటాయని పనిచేస్తున్న ఉద్యోగులు కూడా అభద్రతాభావంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం బ్యాంకింగ్ రంగంలో కూడా పెరిగింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యోగాల కోత ఉంటుందేమోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు
ప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తమ సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల కోత ఉండదని స్పష్టం చేసింది. ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంకులో కూడా జనరేటర్ ఏఐ తో సహా వివిధ సాంకేతిక రంగాలలో ప్రయోగాలు జరుగుతున్నాయని, వాటి ఫలితాలు రాబోయే 18 నుండి 24 నెలల్లో వెల్లడవుతాయని హెచ్డిఎఫ్సి సీఈవో మరియు మేనేజింగ్ డైరెక్టర్ శశిధర్ జగదీష్ పేర్కొన్నారు.
ఏఐతో ఉద్యోగాల కోత ఉండదన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు
ఏఐ వినియోగంతో బ్యాంకులో ఎటువంటి ఉద్యోగాల కోతలు ఉండబోవని ఆయన వెల్లడించారు. అయితే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ పనిచేసే సిబ్బందిని ఏ ఐ కి మళ్లించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ కారణంగా అనేక రంగాలలో ఉద్యోగాల కోత వస్తుందని ఆందోళనలో ఉన్నవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేసిన ప్రకటన ఉద్యోగులకు ఊరటనిచ్చింది. ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రయోగం సక్సెస్ అయినా ఉద్యోగ భద్రత
గత ఆరునెలల కాలంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సుమారు 5000 మందిని నియమించుకుంది. దీంతో సెప్టెంబర్ చివరి నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య రెండు లక్షల ఇరవై వేలకు చేరుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తాము చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అయితే బ్యాక్ ఎండ్ లో పనిచేసే ఉద్యోగులను ఫ్రంట్ ఎండ్ లో వినియోగించుకుంటామని హెచ్డిఎఫ్సి సీఈవో మరియు మేనేజింగ్ డైరెక్టర్ శశిధర్ జగదీష్ చెప్పడం నిజంగా హెచ్డిఎఫ్సి ఉద్యోగులకు శుభవార్త












Click it and Unblock the Notifications