ఏఐ టెక్నాలజీతో భారీ మోసం.. పోంజీ స్కీంతో ఏకంగా 850కోట్లు ఛీటింగ్!

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో అధిక ఆదాయం పొందవచ్చని నమ్మించి పోంజీ స్కీమ్ తో మోసాలకు పాల్పడిన ముగ్గురిని సైబరాబాద్ ఈ ఓ డబ్ల్యు టీం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ముగ్గురు అంతరాష్ట్ర నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మాదాపూర్ లో పలు ఫేక్ కంపెనీలు, నకిలీ వెబ్సైట్లను ప్రారంభించి అమాయకులను మోసం చేసినట్టు గుర్తించారు.

మాదాపూర్లో పలు ఫేక్ కంపెనీలు, నకిలీ వెబ్సైట్లతో మోసం
గడ్డం వేణుగోపాల్, గడ్డం వెంకట్రావు, శ్రేయస్ పాల్ ముగ్గురు కలిసి ప్రధాన నగరాలలో 20 మందికి పైగా ఏజెంట్లను నియమించుకొని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి అధిక ఆదాయం పొందవచ్చు అని నమ్మించి చాలామందిని మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గడ్డం వేణుగోపాల్ మణికొండ లో ఉంటూ మాదాపూర్లో పలు ఫేక్ కంపెనీలను నకిలీ వెబ్సైట్లను ప్రారంభించాడు.

Huge fraud with AI technology 850 crores cheating with a Ponzi scheme

Take a Poll

పోంజీ స్కీంలో పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం అంటూ చీటింగ్
మధ్యతరగతి కుటుంబాల వారిని, విశ్రాంతి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని పోంజీ స్కీంలో పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం వస్తుందని నమ్మబలికి తమ సంస్థలలో పెట్టుబడులు పెట్టాలంటే మరొకరి రిఫరెన్స్ ఉండాలనే నిబంధన విధించి నిదానంగా మధ్యతరగతి మరియు రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేశారు. ప్రతినెల ఏడు శాతం నుంచి 84 శాతం వరకు రిటర్న్స్ రావడం ఖాయమని వారికి నమ్మకం కలిగించారు.

బాధితుల డబ్బు 21 మ్యూల్ ఖాతాలలోకి
నకిలీ డాష్ బోర్డులను రూపొందించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపించారు ఇక బాధితుల నుండి వాళ్ళు సేకరించిన డబ్బును 21 మ్యూల్ ఖాతాలలోకి మళ్లించి మొత్తం 850 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. దేశవ్యాప్తంగా 3164 మందిని మోసం చేశారు. ఇక ఎవరైతే వీరిని నమ్మి పెట్టుబడులు పెట్టారో వారి డబ్బులు స్టాక్ మార్కెట్ లోనే ఉన్నట్టుగా చూపిస్తూ వచ్చిన సొమ్ముతో మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈవో డబ్ల్యూ అధికారులు గుర్తించారు.

సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు
ఇక డబ్బులతో స్థిరాస్తులు, బంగారం, ఖరీదైన వాహనాలు, వ్యాపారాలు పెంచుకున్నారని, డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగిన బాధితులను బెదిరిస్తూ వారి డిజిటల్ రికార్డులు తొలగించారని పోలీసులు పేర్కొన్నారు. ఒక ప్రైవేటు ఉద్యోగి వాళ్ళ మాటలు నమ్మి 23 లక్షలు స్టాక్స్ లో పెట్టుబడి పెట్టి వారి మోసం అర్థం అవడంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏఐ సాయంతో మోసం... అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏఐ సాయంతో ఇంతమంది బాధితులను మోసం చేసినట్టు, స్టాక్ మార్కెట్ లోనే బాధితుల పెట్టుబడులు ఉన్నట్టు ఏఐ ద్వారా చూపించినట్టు పోలీసులు గుర్తించారు ఈ మేరకు ఆధారాలను కూడా సేకరించారు వీరి నుండి రెండు ఖరీదైన కార్లు 11 లాప్టాప్లు మూడు ఫోన్లు, మూడు వేల 164 మంది డేటాబేస్, బినామీ పేర్లతో ప్లాట్లు సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+