చైనా 'ఏఐ' అస్త్రం.. ఆపరేషన్ సింధూర్ సమయంలోనే.. అమెరికా సంచలన రిపోర్టు..

భారత్, చైనాలతో పాటు ప్రపంచ దేశాలపై అమెరికా పన్నులు విధించడం, షాంగై కోపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సులు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం.. తదితర కార్యక్రమాలతో ఇటీవల భారత్- చైనాల మధ్య సంబంధాలు చిగురించాయి. గల్వాన్ వ్యాలీ ఘర్షణతో ఇరు దేశాల మధ్య ఆగిపోయిన సత్సంబంధాలు ఇటీవలి కాలంలో కాస్తంత మెరుగుపడుతూ వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో అమెరికా సంచలన రిపోర్టును వెల్లడించింది. అమెరికా కాంగ్రెషనల్ అడ్వైజరీ బాడీ.. చైనాపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ వ్యవస్థ.. తన వార్షిక నివేదిక ఈ విషయాలను బహిర్గతం చేసింది.

ఏప్రిల్ 22 న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో పాకిస్థాన్ కు చైనా ఎలా సాయం చేసిందో అమెరికా రిపోర్టు బట్టబయలు చేసింది. చైనా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయంతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను ఓపెన్ చేసి భారత్ పై విష ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. భారత్ కు చెందిన రఫేల్ విమానాలు ధ్వంసం అయినట్లు ఏఐ ఆధారిత చిత్రాలను నెట్టింట వైరల్ చేసినట్లు అమెరికా స్పష్టం చేసింది.

ఈ మేరకు నవంబర్ 19న అమెరికా- చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ చైనాపై ఈ ఆరోపణలు చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా మిస్ ఇన్ఫర్మేషన్ ప్రచారాన్ని స్టార్ట్ చేసిందని తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయని ఫేక్ చిత్రాలను ప్రచురించి సామాజిక మాధ్యమాల్లో వాటిని విస్తృతంగా ప్రచారం చేసి తద్వారా భారత డిఫెన్స్ రంగాన్ని ప్రపంచ మార్కెట్ లో బలహీన పర్చాలని కుట్ర పన్నినట్లు అమెరికా- చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

Operation Sindoor Exposes China s Dirty Game AI-Powered Fake Rafale Crash Propaganda Busted

పాకిస్థాన్ తన ఆయుధాలను చైనా నుంచే కొనుగోలు చేసింది. దాంతో చైనా ఆయుధాల దెబ్బకి భారత్, ఫ్రెంచ్ ఆయుధాలు ధ్వంసం అయినట్లు.. ఫేక్ ఫోటోలను సృష్టించి ప్రచారం నిర్వహించింది చైనా. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ లో భారత్, ఫ్రాన్స్ లాంటి దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా చైనా ఆయుధాలకు ధాటికి తట్టుకోలేక కుప్పకూలాయని ప్రచారం చేసింది. తద్వారా తన ఆయుధాలను ప్రపంచ దేశాలు కొనుగోలు చేస్తాయని భావించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+