ఆ హీరోకి కాల్ చేస్తే పరువు నిలబెట్టావన్నారు - శర్వానంద్
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో "శర్వానంద్". శంకర్ దాదా ఎంబీబీఎస్, సంక్రాంతి, లక్ష్మీ సహా పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత హీరోగా ప్రస్థానం, గమ్యం వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. 2014లో విడుదలైన రన్ రాజా రన్ ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు వంటి చిత్రాలతో కమర్షియల్ విజయాలను అందుకున్నారు. గత కొంతకాలంగా మాత్రం వరుస ఫ్లాప్ లతో కొంచెం వెనుకపడ్డారు.
కానీ ఈసారి మాత్రం తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి సీజన్ లో "నారీ నారీ నడుమ మురారి" మళ్లీ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చేశారు. చాలాకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఈ మూవీ భారీ హిట్ అవ్వడం ఫుల్ ఖుషి ఇస్తుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఈ సినిమా సక్సెస్ సాధించిన తరుణంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేనే వేరే పని మీద బాలయ్య బాబుకి ఫోన్ చేసి, "థ్యాంక్ యూ సార్, టైటిల్ ఇచ్చినందుకు.. సినిమా బాగానే రన్ అవుతోంది," అన్నాను. దానికి ఆయన, "ఏయ్, విన్నా. నా పరువు నిలబెట్టావ్," అన్నారని తెలిపారు. కాగా ఈ మూవీ టైటిల్ తో బాలయ్య గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ షో లోనే ఈ టైట్ల రివీల్ కూడా చేశారు. దీంతో ఈ యంగ్ హీరో అభిమానులతో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక శర్వానంద్ గతంలో 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శతమానం భవతి' వంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి ఘన విజయం సాధించాయి. 2017లో చిరంజీవి 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'లతో పోటీపడిన శర్వానంద్ 'శతమానం భవతి'తో ఆ ఏడాది సంక్రాంతి విన్నర్ అనిపించుకున్నాడు. ఈ ఏడాది కూడా చిరంజీవి, రవితేజలతో పోటీపడి కూడా బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం అని చెప్పాలి.












Click it and Unblock the Notifications