బాలయ్యను పక్కన పెట్టేసిన బోయపాటి.. కత్తిలాంటి హీరోను పట్టాడు

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఊరమాస్ జాతరకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు బోయపాటి శ్రీను.. ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత కీలకమైన మలుపులో నిలబడ్డారు. నందమూరి బాలకృష్ణతో 'సింహా', 'లెజెండ్', 'అఖండ' లాంటి ఇండస్ట్రీ హిట్లతో ఒకప్పుడు తిరుగులేని రేంజ్‌లో దూసుకెళ్లిన ఈ మాస్ డైరెక్టర్‌కు, ఇటీవలి నుంచి కాలం కలిసిరావడం లేదు.

ముఖ్యంగా, బాలయ్య కాంబినేషన్ మినహా మిగతా హీరోలతో ఆయన చేసిన యాక్షన్ ప్రయోగాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయనే విమర్శ ఉంది. ఈ క్రమంలోనే గతేడాది ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సీక్వెల్ 'అఖండ-2' బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. యావరేజ్ టాక్‌కే పరిమితమైన ఈ చిత్రం.. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం నిర్మాతలకు ఏకంగా రూ. 80 కోట్లకు పైగా భారీ నష్టాలను మిగిల్చింది. ఈ పరాజయం బోయపాటిని తన రెగ్యులర్ రూట్ మార్చుకునేలా చేసింది.

Explained:రెండో టాలీవుడ్ హబ్‌గా అమరావతి.. ఏపీ వైపు ఇండస్ట్రీ చూపు..!!
Explained:రెండో టాలీవుడ్ హబ్‌గా అమరావతి.. ఏపీ వైపు ఇండస్ట్రీ చూపు..!!
Boyapati has set nandamuri balakrishna aside and picked up tamil actor suriya

విమర్శకులకు సమాధానం చెప్పేలా

బాలయ్య మార్క్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి, తనపై ఉన్న విమర్శలకు గట్టి సమాధానం చెప్పేందుకు బోయపాటి ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టి.. ఏకంగా కోలీవుడ్ వైపు అడుగులు వేశారు. వర్సటైల్ యాక్టింగ్‌తో వైవిధ్యమైన పాత్రలు పోషించే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును లైన్‌లో పెట్టారు. ఇప్పటికే సూర్యకు బోయపాటి ఒక పవర్‌ఫుల్ స్టోరీ లైన్ వినిపించడం, దానికి సూర్య పూర్తిస్థాయిలో ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయాయి.

సూర్య మార్క్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, బోయపాటి మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్.. ఈ రెండూ సరిగ్గా కుదిరితే వెండితెరపై గూస్‌బంప్స్ గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం సౌత్ మార్కెట్ మాత్రమే కాకుండా, నార్త్ ఆడియన్స్‌ను కూడా మెప్పించేలా ఈ స్క్రిప్ట్‌ను పాన్ ఇండియా స్థాయిలో బోయపాటి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆలస్యం లేకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

తండ్రి అయిన టాలీవుడ్ హీరో.. వారాసుడొచ్చాడోచ్ !!
తండ్రి అయిన టాలీవుడ్ హీరో.. వారాసుడొచ్చాడోచ్ !!

మరో టాలీవుడ్ క్రేజీ హీరోను కూడా..

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సూర్య ప్రాజెక్ట్‌తో పాటు సమాంతరంగా టాలీవుడ్‌కు చెందిన మరో క్రేజీ హీరోను కూడా బోయపాటి లైన్‌లో పెడుతున్నట్లు సమాచారం. మరి బాలయ్య సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి, కోలీవుడ్ స్టార్ సూర్యతో చేయబోయే ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్‌తో బోయపాటి తన పూర్వ వైభవాన్ని అందుకుంటారా? బాక్సాఫీస్ దగ్గర మళ్లీ తన మాస్ సత్తా చాటుతారా? అనేది ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+