పాకిస్థానీయులకు పిచ్చెక్కిస్తున్న ఇండియన్ సినిమా..!

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది 'మహావతార్ నరసింహ' చిత్రం. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా.. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. మహావిష్ణువు అవతారమైన నరసింహ స్వామి - భక్త ప్రహ్లాద కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే విడుదలైన ఈ యానిమేటెడ్ మూవీ.. కేవలం మౌత్ టాక్ ద్వారానే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.

ముఖ్యంగా ఈ సినిమాలో కథ, కథనం, అద్భుతమైన గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిజంగా నరసింహ స్వామి వచ్చి కనిపించాడా అన్న స్థాయిలో విజువల్స్ అదిరిపోయాయి. ఆ ఎలివేషన్ సీన్స్.. అందుకు తగ్గట్టుగా వచ్చే మ్యూజిక్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. యానిమేషన్ చిత్రాలంటే కేవలం చిన్నపిల్లల కోసమే అనుకునే ధోరణికి ఈ మూవీ ఫుల్ స్టాప్ పెట్టేసింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ మూవీని చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పుడు ఈ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది.

mahavathar-narasimha-movie-screening-at-swami-narayana-temple-in-pakisthan

పాకిస్తాన్‌లోని కరాచీలో గల చారిత్రక శ్రీ స్వామినారాయణ మందిరంలో "మహావతార్ నరసింహ" ప్రదర్శించబడిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం.. కరాచీలో మిగిలి ఉన్న కొన్ని క్రియాశీల హిందూ దేవాలయాలలో ఒకటిగా నిలుస్తుంది. ప్రస్తుతం భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా కూడా భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇండియన్ సినిమాకి పాకిస్థాన్ దేశంలో నీరాజనాలు పలకడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ యానిమేటెడ్ చిత్రం హిందూ ఇతిహాసాలపై ఆధారపడడంతో.. వేలాది మంది భక్తులు ఆలయం వద్దకు తరలివచ్చి సినిమాని వీక్షిస్తునట్టు చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి సమాచారం గానీ.. అధికారిక ధృవీకరణ గానీ ఇంకా లభ్యం కాలేదు. ఏ ప్రధాన వార్తా సంస్థ గానీ, ఆలయ అధికారిక వర్గాలు గానీ ఈ ప్రదర్శన జరిగినట్లు నిర్ధారించలేదు. దీంతో అసలు ఈ వ్యవహారం నిజమేనా కాదా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇందుకు సంబంధించిన వీడియోలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి.

మరోవైపు లేటెస్ట్ గానే ఈ మూవీ మరో ఘనత సాధించింది. 98వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. యానిమేషన్ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్ లో ఎంట్రీ పొందింది. ఈ విషయాన్ని అకాడమీ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది. మహావతార్ నరసింహా సినిమా ఆస్కార్ కు ఎంపికవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+