సౌత్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్..!
తెలుగు డిజిటల్ స్క్రీన్‌పై సంచలనాలు సృష్టించిన 'సేవ్ ది టైగర్స్' మరోసారి ఓటీటీ వద్ద గర్జించింది. జూన్ 19న విడుదలైన 'సేవ్ ది టైగర్స్ 3' సరికొత్త వ్యూయర్‌షిప్ రికార్డులతో దూసుకుపోతోంది. సాధారణంగా ఒక సిరీస్‌కు వరుస సీజన్లు వచ్చే కొద్దీ క్రేజ్ , సక్సెస్ రేట్ తగ్గుతుంటుంది. కానీ, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ, మూడో సీజన్‌తో అంతకుమించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించి దక్షిణ భారతంలోనే అతిపెద్ద డిజిటల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ఈ సిరీస్.
నిరూపించుకున్న మహి వి.రాఘవ్
ఈ సిరీస్ వెనుక ఉన్న అసలైన మాస్టర్ మైండ్, షోరన్నర్ మహి వి రాఘవ్ తన సక్సెస్ ట్రాక్‌ను మరోసారి నిరూపించుకున్నారు. 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' వంటి సినిమాలతో వెండితెరపై మెప్పించిన ఆయన, వెబ్ స్పేస్‌లోనూ తిరుగులేని రికార్డును సొంతం చేసుకున్నారు. 'సేవ్ ది టైగర్స్' మొదటి రెండు సీజన్లు, అలాగే 'సైతాన్' వంటి వైవిధ్యమైన థ్రిల్లర్ ప్రాజెక్టుల తర్వాత ఇప్పుడు సీజన్ 3తో లాంగ్-ఫార్మ్ స్టోరీటెల్లింగ్‌లో తన బ్రాండ్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో మహి సక్సెస్ అయ్యారు.

కొరియన్ తరహా డ్రామా
వెస్ట్రన్ లేదా కొరియన్ డ్రామాల తరహాలో ఇండియాలోనూ బలమైన టెలివిజన్ సిరీస్ సంస్కృతిని తీసుకురావడమే లక్ష్యంగా మహి వి రాఘవ్ పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. ఇండియాలో టెలివిజన్ సిరీస్‌లకు మన ప్రేక్షకులు ఇంకా పూర్తిగా అలవాటు పడలేదు. అందుకే మన దగ్గర ఓటీటీ కల్చర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ గ్యాప్‌ను భర్తీ చేస్తూ అంతర్జాతీయ స్థాయి ఫ్రాంచైజీల తరహాలో 'సేవ్ ది టైగర్స్'ను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు.
జియో హాట్ స్టార్‌లో
ఈ వెబ్ సిరీస్ నిర్మాణ సంస్థ 'త్రీ ఆటమ్ లీవ్స్' ఎప్పుడూ రొటీన్ ఫార్ములాలకు భిన్నంగా సరికొత్త రీజినల్ కంటెంట్‌ను నమ్ముకుంటుంది. సరికొత్త బిజినెస్ మోడల్స్‌తో, క్వాలిటీతో కూడిన ప్రీమియం కంటెంట్‌ను నేరుగా ప్రేక్షకులకు అందించడం వల్లే ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మరిన్ని వ్యూస్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications