అందం కోసం బ్యూటీ పార్లర్ లకు వెళ్తున్నారా? అయితే ఇది మీ కోసమే!
సహజంగా చాలామంది అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్లకు పరుగులు పెడుతుంటారు. రకరకాల ఫేషియల్స్, ఫేస్ ప్యాక్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. బయట నుండి ఎన్ని క్రీములు రాసినా, ఎన్ని ఫేషియల్స్ చేసినా మనం ఒక ఒక విషయం మీద శ్రద్ధ పెట్టకపోతే ఆ అందం నిలవదు. అసలు అందంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ప్రతి ఒకరికి తెలిసి ఉండాలి.
దీర్ఘకాలిక ఒత్తిడితో అందంపైన ప్రతికూల ప్రభావం
అందంగా ఉండాలి అంటే ముందుగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఎటువంటి మానసిక ఒత్తిడి మనపైన ఉండకూడదు. దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళనలు అందంపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. సహజంగా మానసికంగా మన పైన ఒత్తిడి గురించి శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది మీ చర్మంపై మిమ్మల్ని ఎక్కడ ప్రేరేపించి అధిక నూనెను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

ఒత్తిడి, నిద్రలేమితో తగ్గుతున్న అందం
ఫలితంగా ముఖంపైన మొటిమలు రావడం, జుట్టు రాలిపోవడం, జుట్టు పల్చబడటం, ముఖం మీద ముడతలు పడడం, సోరియాసిస్, దద్దుర్లు వంటివి రావడం, చర్మం పొడిబారడం జరుగుతుంది. దీనివల్ల మీ అందం తగ్గుతుంది. ఇక ఇదే సమయంలో నిద్రలేమి కూడా మీ అందాన్ని బాగా తగ్గిస్తుంది. నిద్రలేమి కారణంగా కళ్ళ క్రింద నల్లని వలయాలు ఏర్పడతాయి. కళ్ళ క్రింద క్యారీ బ్యాగ్స్ వస్తాయి.
బ్యూటీ పార్లర్‌లో ఎంత ఖర్చు పెట్టినా ఒత్తిడి ఉంటే కష్టమే
నిద్రలేమి కారణంగా చర్మం స్థితిస్థాపకత కోల్పోతుంది. చర్మం ముడతలు, వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. చర్మం పొడిబారడం, దురద రావడం కూడా సాధారణంగా ఉంటుంది. బ్యూటీ పార్లర్‌లో ఎంత ఖర్చు పెట్టినా ఒత్తిడి తగ్గకపోతే ఫలితం ఉండదు. కాబట్టి ముందుగా అందంగా ఉండాలంటే ఒత్తిడిని నియంత్రించుకోవాలి. మంచి పౌష్టికాహారం తినాలి. రోజూ 7 గంటల నుండి 8 గంటలు నిద్ర పోవాలి.
బ్యూటీ ప్రొడక్ట్స్, పార్లర్స్ కంటే మానసిక ప్రశాంతతే నిజమైన అందానికి దోహదం
చామొమైల్ టీ, గుడ్లు, డార్క్ చాక్లెట్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు ఆహారంగా తీసుకోవాలి. రోజూ అరగంట వ్యాయామం, యోగా, ధ్యానం చేస్తే మంచిది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపాలి. ఒత్తిడి అదుపులో ఉంటే చర్మం సహజంగా మెరుపును సంతరించుకుంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కళ్లు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. బ్యూటీ ప్రొడక్ట్స్, పార్లర్స్ కంటే మానసిక ప్రశాంతతే నిజమైన అందానికి దోహదం చేస్తుంది.













Click it and Unblock the Notifications