భారత్ పై మరోసారి దాడికి పాకిస్థాన్ కుట్ర..? చైనా ఆయుధాలతో బోర్డర్ లో విధ్వంసం..!

భారత్ కు సరిహద్దు దేశాలుగా ఉన్న పాకిస్థాన్, చైనాలతో ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటూనే ఉంది. అటు పాకిస్థాన్, ఇటు చైనాతో దశాబ్దాలుగా భారత్ అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటోంది. అయినా ఏనాడు ఆ శత్రు దేశాలకు తలవంచకుండా వాటి కుయుక్తులను, కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఆసియా ఖండంలోనే అగ్ర గ్రామిగా భారత్ అవతరిస్తోంది. ఇక గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ యుద్ధ సమయంలో చైనా, టర్కీ అందించిన డ్రోన్ లు, క్షిపణులను భారత్ పై ప్రయోగించింది పాకిస్థాన్.. కానీ వాటిని భారత్ కు చెందిన ఎస్-400 డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా నేలకూల్చింది.

అయితే భారత సరిహద్దులో మరోసారి విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ రెడీ అవుతున్నట్లు నిఘా వర్గాలు తేల్చాయి. చైనాకు చెందిన 250 ఎస్ హెచ్ ట్రక్ హోవిట్జర్లను సరిహద్దులో మోహరించినట్లు పేర్కొన్నాయి. ఇరు దేశాల సరిహద్దులోని కీలక మైన ప్రాంతాల్లో 155 ఎంఎం ఆర్టిలెరీ సిస్టమ్స్ ను పొజిషనింగ్ చేసినట్లు స్పష్టం చేశాయి. నార్త్ నుంచి సౌత్ వరకు సరిహద్దు గుండా ఈ SH-15 ఆర్టిలెరీ గన్స్ ను పాకిస్థాన్ మోహరించడం ఇప్పుడు దేశ భద్రతలో కీలకంగా మారింది. ఈ గన్స్ భారత్ వైపు గురిపెట్టి ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా పరిగణిస్తున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు.

చైనా సైన్యంలో పీసీఎల్-181 గా పిలిచే ఎస్ హెచ్-15 ను చైనా ప్రభుత్వ రంగ రక్షణ పరికరాల తయారీ సంస్థ నోరింకో అభివృద్ధి చేసింది. 155 ఎంఎం, 52 క్యాలిబర్ కలిగిన చక్రాల ఆధారిత సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలెరీ సిస్టమ్ ను కలిగి ఉంది. 2019 లో పాకిస్థాన్ 236 ఎస్ హెచ్- 15 ఫిరంగి వ్యవస్థల కోసం ఆర్డర్ చేసింది. వీటి సరఫరా 2022 లో ప్రారంభం కాగా.. అదనప్ బ్యాచ్ లు 2023 లో వచ్చినట్లు సమాచారం. ఈ ఆర్టిలెరీ సిస్టమ్స్ ను భారత్- పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలైన గుజ్రాన్ వాలా, సియాల్ కోట్, జలాల్ పూర్ జట్టాన్ లో మోహరించినట్లు తెలుస్తోంది.

Pakistan deploys Chinese SH-15 artillery guns along the Indian border here is India s reaction

రిపోర్టుల ప్రకారం.. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల వద్ద ఎస్ హెచ్-15 వ్యవస్థలను మోహరించింది పాకిస్థాన్ సైన్యం. వీటిని సమర్థవంతంగా భారత్ సైన్యం తిప్పికొట్టింది. అయితే సరిహద్దు ప్రాంతాల వద్ద పాకిస్థాన్ కదలికలను భారత సైన్యం నిశితంగా పర్యవేక్షిస్తోంది. అందుకు తగిన వ్యూహాత్మక చర్యలను అనుసరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+