‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌. 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్లను షురూ చేసింది. పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

కుటుంబ ప్రేక్షకులంతా కలిసి చూడొచ్చు

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా 'U/A' సర్టిఫికేట్‌ను జారీ చేసింది. 2 గంటల 29 నిమిషాల నిడివి ఉంది. ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా ఈ టైం సరిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉస్తాద్ లో ఎక్కడా శృతిమించిన రొమాన్స్ ఉండదని, కేవలం డీసెంట్ యాక్షన్, పవర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉందని, ఈ వేసవిలో కుటుంబ సభ్యులంతా హాయిగా కలిసివచ్చు సినిమాను చూడొచ్చనే అభిప్రాయాన్ని సెన్సార్ సభ్యులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ అభిమానులు ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే నమ్మకంతో ఉన్నారు.

Ustad Bhagat Singh Censor Board has given a U A certificate to pawan kalyan harish shankar film

చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతో ఉంది

సంగీతం పరంగా కూడా ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు హిట్ అవ్వగా, తాజాగా మూడో సాంగ్ ప్రోమో విడుదలైంది. "నెగ్గే దాకా తిక్కే ఉండాలే" అంటూ సాగుతుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం సినిమాకు ప్రధాన బలంగా మారాయి. అయితే అభిమానులు కోరుకున్నట్లుగా ఉస్తాద్ లో ఎటువంటి ఐటమ్ సాంగ్ లేదని దర్శకుడు స్పష్టం చేయడంతో అభిమానులు కాస్తంత నీరసపడ్డారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అంటే కచ్చితంగా అదిరిపోయే ఐటం సాంగ్ ఉంటుందని అనుకున్నామని, ఈ వార్తతో తామంతా నీరసపడ్డామంటున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్, చెరుకూరి మోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమాలో రాజకీయ డైలాగులు ఉండవని, పూర్తిగా మాస్ ఆడియన్స్, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా తీర్చిదిద్దామని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+