1381 కిలోల బంగారం విషయంలో టీటీడీ వైఖరిపై మీ కామెంట్ చెప్పండి
టీటీడీ బంగారం తరలింపు వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 1381 కిలోల బంగారాన్ని అవసరమైన డాక్యుమెంట్లు లేకుండానే తరలించడం అనుమానాలు రేకెత్తించింది. ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారం తరలింపు ప్రక్రియలో లోపాలు నిజమేనని ఏపీ సీఎస్ అంగీకరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి 1381 కిలోల బంగారం పట్టుబడిన నాటి నుంచి టీటీడీ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ బంగారం మాదే కానీ మాది కాదంటూ టీటీడీ ఈవో అనిల్ సింఘాలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బంగారం తరలింపు బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదేనని, దాన్ని తమ వద్ద జమ చేసిన తర్వాతే ఆది టీటీడీది అవుతుందన్నది ఆయన మాట.

ఇదిలా ఉంటే టీటీడీ బంగారం తరలింపులో పీఎన్‌బీ బ్యాంకు అధికారుల వైఖరి సైతం అనుమానాలకు తావిచ్చేలా ఉంది. భారీ మొత్తం బంగారాన్ని ప్రైవేట్ వాహనంలో ఎందుకు తరలించారన్నది జవాబులేని ప్రశ్నగానే మిగిలింది. ఇక గోల్డ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు విషయంలో అటు టీటీడీ గానీ, ఇటు పంజాబ్ నేషనల్ బ్యాంకు గానీ వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీవారి బంగారం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖరిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
-
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications