కర్ణాటక రెబల్స్ పై మాజీ స్పీకర్ వేటు.. భగ్గుమన్న ఎమ్మెల్యేలు, బీజేపీ..! మీ కామెంట్ ఏంటీ?

రెబెల్స్ వేటు వేస్తూ కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటకలో కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం 14 నెలల వ్యవధిలోనే కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం. రాజీనామా చేసే హక్కు వారికి ఎమ్మెల్యేలకు ఉంది. అయినప్పటికీ.. వారిపై తిరుగుబాటుదారులు అనే ముద్ర వేసి, అనర్హత వేటు వేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. రమేష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థించే వారు కొందరైతే..

అలా ఎలా అనర్హులుగా గుర్తిస్తారంటూ ఆక్షేపించే వారూ చాలామందే ఉన్నారు. తమ పార్టీకి చెందని సభ్యులే అయినప్పటికీ.. బీజేపీ సైతం స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో- తిరుగుబాటుదారులను అనర్హులుగా గుర్తించడం వల్ల శాసనసభపై ఉన్న ప్రజల్లో ఉన్న గౌరవాన్ని పెంచినట్టయిందని, ప్రజాస్వామ్య విలువలను రమేష్ కుమార్ కాపాడగలిగారనీ అంటోంది మేధావి వర్గం. తమ సొంత పార్టీ సారథ్యం వహిస్తున్న ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి, ఉప ఎన్నికలు రావడానికీ కారణమైన రెబెల్స్ పై చర్య తీసుకోవడం హర్షణీయమనే అని అంటున్నారు ప్రజలు.

Karnataka Assembly foremer Speaker Ramesh Kumar disqualified rebel MLAs right or wrong?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+