నేనేం తప్పు చేశానంటున్న చంద్రబాబు వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజలకు అన్నీ చేసినా.. నేనేం తప్పు చేశారని ఈ తీర్పు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసారు. కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా అక్కడి మహిళలు చంద్రబాబు వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నికల్లో ఓడిపోవటం ఏంటంటూ రోదించారు. చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా..పదేళ్లు ప్రతిపక్ష నేతగా పని చేసానని గుర్తు చేసారు. అయితే, కార్యకర్తల మీద దాడులు చేస్తే అక్కడికే వెళ్లి తాను తిష్ట వేస్తానని హెచ్చరించారు.
కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా స్థానికులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో పలువురు మహిళలు చంద్రబాబు వద్దకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. మీరు ఓడిపోవటం ఏంటంటూ రోదించిన వారికి చంద్రబాబు ధైర్యం చెప్పారు. అందరి బాగోగులు తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. 35 ఏళ్లుగా కుప్పంలో తనకు లభిస్తున్న ఆదరణ మర్చిపోలేనని వివరించారు. కుప్పం అభివృద్ది కోసం ..అదే సమయంలో ముఖ్యమంత్రిగా రాష్ట్ర పురోగతి కోసం తాను చేసిన కృషిని వివరించారు. అనంతపురంలో కరువు సమస్యను పరిష్కరించి కొరియా వెళ్లి కియో ఫ్యాక్టరీ తీసుకొచ్చానని వివరించారు. ఇన్ని పనులు చేస్తే ప్రజలు ఎలా తీర్పు ఇచ్చారో అర్దం కాలేదని ఆవేదన వ్యక్తం చేసారు.

ఇదిలా ఉంటే తానేం తప్పుచేశాని ఓడించారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ భ్రష్టు పట్టించడంతో పాటు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసినందుకు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు. నిజంగా తప్పు చేయకుంటే ప్రజలు ఎందుకు శిక్షించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద తానేం తప్పు చేశానని శిక్ష వేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications