AP EAPCET 2026 Results: ఎంసెట్ ఫలితాలకు ముహుర్తం ఫిక్స్-ఇలా తెలుసుకోండి..!
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ఫలితాలు (AP EAPCET 2026 Results) విడుదలకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే పరీక్షలు రాసిన అభ్యర్ధుల కోసం ప్రాథమిక కీ విడుదల చేసిన కాకినాడ జేఎన్టీయూ అధికారులు.. అభ్యంతరాలను కూడా స్వీకరించారు. వీటి ఆధారంగా తుది కీ విడుదల చేయడంతో పాటు ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఈసారి ఎంసెట్ లో భాగంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్ని మే 12, 13, 14, 15, 18 తేదీల్లో నిర్వహించారు. అనంతరం వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 19, 20 తేదీల్లో పరీక్షలు జరిగాయి. ఎంసెట్ పరీక్షలకు మొత్తం 3.55 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ కు 2.75 లక్షల మంది, వ్యవసాయ, ఫార్మసీ కోర్సులకు 78 వేల మంది దరఖాస్తు చేశారు. వీరిలో దాదాపుగా అందరూ పరీక్షలకు హాజరయ్యారు. వీరంతా ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

దీంతో ఉన్నత విద్యామండలి తరఫున కాకినాడ జేఎన్టీయూ వచ్చే నెల 1న ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. తుది కీతో పాటు పరీక్ష ఫలితాలు కూడా ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్ధులు అప్రమత్తంగా ఉండి పరీక్ష ఫలితాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ వివరాలను ఉపయోగించి అధికారిక
వెబ్ సెైట్ cets.apsche.ap.gov.in లోకి లాగిన్ అయి ఫలితాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లోకి లాగిన అయిన తర్వాత అభ్యర్ధులు తమ ర్యాంక్ కార్డులు , స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. వివిధ కేటగిరీల్లో అర్హత మార్కుల్ని పరిశీలిస్తే.. జనరల్ కేటగిరీకి 160 మార్కులకు గాను 40 (25%) తెచ్చుకోవాలిు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీస కటాఫ్ వర్తించదు.












Click it and Unblock the Notifications