AP Inter Marks Memos: ఏపీలో ఇంటర్ మార్కు మెమోల విడుదల-ఇలా చెక్ చేసుకోండి ?
ఏపీలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసింది. ఇవాళ వీటికి సంబంధించిన మార్కు మెమోల్ని కూడా బోర్డు అందుబాటులోకి తెచ్చింది. వీటిని అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రింట్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు కూడా ప్రారంభం కానుంది.
ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు రాసిన అభ్యర్ధులు మార్క్ మెమోల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బోర్డు అధికారిక వెబ్ సైట్లో వీటిని అప్ లోడ్ చేశారు. వీటిని యాక్సెస్ చేసేందుకు వీలుగా పలు సూచనలు కూడా చేస్తున్నారు. https://bieap.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి మార్క్ మెమోల్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. వెబ్ సైట్లోకి వెళ్లాక అభ్యర్ధులు తమ హాల్ టికెట్ నంబర్ తో పాటు పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే మార్క్ మెమోలు డౌన్ లోడ్ అవుతాయి. అక్కడే వాటిని ప్రింట్ తీసుకోవచ్చు.

మరోవైపు ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన వారికి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే మార్కుల ఇంప్రూవ్ మెంట్ కావాలనుకునే వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలకు రేపటి నుంచి ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఏప్రిల్ 24వ తేదీ వరకూ ఇలా ఫీజులు చెల్లించవచ్చు. అలాగే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం కూడా ఫీజు చెల్లించవచ్చు. ఒక్కో జవాబు పత్రం రీ వెరిఫికేషన్‌కు రూ.1300 చొప్పున చెల్లించాలి. అలాగే ఒక్కో పేపర్ రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలి. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే ప్రతీ విద్యార్ధీ రూ.550 ఫీజు చెల్లించాలి. ప్రాక్టికల్స్ పరీక్షలకైతే రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలి.












Click it and Unblock the Notifications