ఏపీ ఐ సెట్ రిజల్ట్స్ రిలీజ్.. టాప్ ర్యాంక్ ఆ జిల్లా విద్యార్ధికే ?
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ ఈరోజు అధికారికంగా ఫలితాలను ప్రకటించారు. ఈ సంవత్సరం నిర్వహించిన ఐసెట్ పరీక్షలో మొత్తం 34,131 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 32,719 మంది అర్హత సాధించగా.. 95.86 శాతంగా పర్సంటేజ్ నమోదైంది. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ విజేతలకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
మే 7న రెండు తెలుగు రాష్ట్రాల్లో 94 కేంద్రాల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించబడింది. అర్హత పొందిన వారిలో 15,176 మంది అబ్బాయిలు, 17,543 మంది అమ్మాయిలు ఉన్నారు. ఫలితాల విడుదల తర్వాత త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

టాప్ 10 ర్యాంకర్లు..
1. మనోజ్ మేకా (విశాఖపట్నం)
2. ద్వారకచర్ల సందీప్ రెడ్డి (వైఎస్సార్ జిల్లా)
3. ఎస్. కృష్ణసాయి (ఎన్టీఆర్ జిల్లా)
4. వల్లూరి సాయిరాం సాత్విక్ (హైదరాబాద్)
5. రేవూరి మాధుర్య (గుంటూరు)
6. షేక్ బషీరున్నీషా (అనకాపల్లి)
7. వి. అజయ్ కుమార్ (తిరుపతి)
8. భీశెట్టి హరి వెంకట ప్రసాద్ (తూర్పుగోదావరి)
9. ఎస్. గణేశ్ రెడ్డి (విశాఖపట్నం)
10. మహేంద్ర సాయి చామా (తిరుపతి)
Congratulations to all the students who qualified in AP ICET 2025!! Results are now available at https://t.co/IQ2oLrRu7D & WhatsApp Governance No. 9552300009.
— Lokesh Nara (@naralokesh) May 20, 2025
32,719 out of 34,131 students qualified (95.86%). My best wishes for your bright academic future!!#APICET2025












Click it and Unblock the Notifications