AP TET 2024 ః టెట్ అభ్య‌ర్థుల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్‌.. ఆ నిబంధ‌న తొల‌గింపు

టెట్ అభ్య‌ర్థుల‌కు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. టెట్ పేపర్ 2 రాసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్ధులకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. అయితే, దీనిపైన పెద్దఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆ నిబంధ‌న‌ను సవరించింది. ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. అలాగే, టెట్ పేప‌ర్ 1 రాసేందుకు ఇంట‌ర్‌లో 50 శాతం మార్కులు, ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్‌లో రెండేళ్ల డిప్ల‌మా లేదా 50 శాతం మార్కుల‌తో సీనియర్ సెకండ‌రీతోపాటు నాలుగేళ్ల ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ డిగ్రీ ఉండాల‌ని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీజీ, దివ్యాంగుల‌కు ఐదు శాతం మార్కులు స‌డ‌లింపునిచ్చింది.

గురువారం (ఫిబ్రవరి 8) నుంచి టెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్ర‌క్రియ మొద‌లైంది. ఫిబ్రవరి 18 వరకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం క‌ల్పించారు. అలాగే, ఫిబ్రవరి 19వ తేదీన ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ రాసేందుకు అభ్యర్థులకు అవకాశం క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తర్వాత ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ లోపు రెండు సెషన్స్‌లో ఏపీ టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

AP TET 2024: Govt good news for TET candidates.. removal of that rule

టెట్ ప‌రీక్షలు.. రెండు సెషన్స్‌

టెట్ ప‌రీక్షను మొత్తం రెండు సెష‌న్స్‌లో నిర్వ‌హించ‌నున్నారు. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థులు ఏపీ టెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేది: ఫిబ్రవరి 8 నుంచి
అప్లికేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 18 వరకు
ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టు: ఫిబ్రవరి 19న
హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌: ఫిబ్రవరి 23 నుంచి
పరీక్ష రుసుము: రూ.750.
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)
ఫలితాల తేది: 14.03.2024.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+