ముగ్గురు పిల్లల ఫోటో షేర్ చేసిన ఉపాసన.. సోషల్ మీడియా షేక్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' మూవీ సక్సెస్ లో ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు రూ. 400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. మున్ముందు కలెక్షన్స్ పరంగా మరిన్ని రికార్డుల్ని పెద్ది మూవీ నమోదు చేసే అవకాశం ఉంది. ఇక రామ్ చరణ్- ఉపాసన వివాహం జూన్ 14, 2012 లో జరిగింది. అయితే ఇవాళ ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లిరోజు సందర్భంగా ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. అటు పెద్ది మూవీ బ్లాక్ బస్టర్ కావడం.. ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యారేజ్ యానివర్సరీ కావడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే ఈ శుభ సమయాన రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రామ్ చరణ్- ఉపాసన దంపతులకు ఈ ఏడాది జనవరి 31 న కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఉపాసన ఓ మగ, ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.

RamCharan and Upasana s Twins Photo Upasana Posts Adorable Picture Internet Buzzing RamCharan

తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే పిల్లలకు శివరామ్, అన్విరా దేవి అని పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉపాసన కవల పిల్లల ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ముగ్గురు పిల్లల చేతులను చూపిస్తూ ఆ పోస్టు ఉంది. ఆ పోస్ట్ కు హార్ట్ ఈజ్ ఫుల్ అని క్యాప్షన్ జోడించారు ఉపాసన.

ఇక ఈ పోస్టుపై మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కేవలం ఫోటో మాత్రమే కాదని.. ఇది లవ్, లెగసీ అని పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అన్న , వదిన అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+