తులారాశి, వృశ్చిక రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. దీన్ని ప్రభావితమయ్యే రాశులవారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. అలాగే సెప్టెంబరు నెలకు సంబంధించి తులా రాశి, వృశ్చిక రాశికి సంబంధించినవారి జాతక ఫలం ఎలా ఉందో తెలుసుకుందాం.

తులారాశి
ఈ రాశి వారికి సెప్టెంబరు నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. నెల మొదటి సగం కొంచెం ఒత్తిడితో కూడుకున్నప్పటికీ, ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం. వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడులపై నిలకడగా లాభాలు వస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశముంది. అనవసర వ్యయాలను నియంత్రించుకోవడం మంచిది. రుణాలు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు, సంయమనం పాటిస్తే సమస్యలు సద్దుమణుగుతాయి. కంటి సమస్యలు లేదా అలసట ఇబ్బంది పెట్టవచ్చు. లక్ష్మీదేవి పూజ లేదా వేంకటేశ్వరస్వామి దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది.

horoscope-for-libra-and-scorpio-for-the-month-of-september

వృశ్చిక రాశి
ఈ రాశి వారికి సెప్టెంబరు నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా స్థానచలనం లభించే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికంగా కలసివచ్చే సమయం. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. సుబ్రహ్మణ్యస్వామి లేదా ఆంజనేయస్వామి ఆరాధన శ్రేయస్కరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+