విశాఖలో అయిదు దశాబ్దాల అనుబంధం నేటితో ముగింపు- ఇక గత స్మృతిగా..!!
అయిదు దశాబ్దాల అనుబంధం. మరిచిపోలేని అనుభవం. సముద్రం మీదుగా విమానం గాలిలోకి ఎగురుతుంటే విండో సీట్లో కూర్చుని చేసిన ప్రయాణం. ఇక.. ఇదంతా గతం. కోట్లాది మంది ప్రయాణీకులకు రాక పోకలకు విశాఖ విమానాశ్రయం వేదికగా నిలిచింది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన నేపథ్యంలో దీనిని పూర్తిగా మూసి వేస్తున్నారు. విశాఖలో ఈ విమానాశ్రయం మూసివేత వేళ గత చరిత్ర గుర్తు చేసుకుంటున్నారు.
విశాఖ విమానాశ్రయం లో ఇక విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు సిద్ధమై సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి విశాఖ విమానాశ్రయానికి రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఇక.. తూర్పు నౌకాదళం పూర్తిస్థాయిలో దీనిని ఉపయోగించుకోనుంది. విశాఖపట్నం విమానాశ్రయానికి ఘనమైన చరిత్ర ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో (1941) ఆంగ్లేయులు రాయల్ ఎయిర్‌ఫోర్స్ కోసం ఇక్కడ చిన్న రన్ వే (ఎయిర్ స్ట్రిప్) నిర్మించారు.నౌకాదళం 1972లో ఇదే రన్‌వేను రక్షణ అవసరాలకు ఉపయోగించుకోవడం ప్రారంభించింది. విశాఖలో తూర్పు నౌకాదళం కార్యకలాపాలు విస్తృతం కావడంతో, 1986లో ఆ రన్‌వేను, భూములను రక్షణ శాఖకు బదిలీ చేశారు. మొదట్లో విశాఖ పట్నానికి రోజుకు ఒకటే విమానం వచ్చి వెళ్లేది. సుమారు 3,050 మీటర్ల పొడవైన రన్‌వేను నిర్మిం చి 2007 జూన్ 15 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఎంతో ఘన చరిత్ర
కాగా, ప్రయాణికుల సంఖ్య పెరగడంతో వారి కోసం 2008లో ప్రత్యేకంగా ఒక టెర్మినల్ అందు బాటు లోకి తీసుకొచ్చారు. క్రమేణా శ్రీలంక, సింగపూర్, మలేసియా, బ్యాంకాక్‌లకు అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. తదనంతర పరిణామాలతో విమానాశ్రయంలోకి ఒక వైపు నుంచే(సముద్రం మీదుగా) ల్యాండిం గ్, టేకాఫ్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. భోగాపురం లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తరువాత నేవీ విశాఖ వచ్చే విమానాలపై ఆంక్షలు పెంచింది. రాత్రి 11 గంటల తరువాత, ఉదయం 5 గంటలలోపు ఏ విమానాన్నీ అనుమతించడం లేదు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. కాగా.. ఈ రోజు అర్ ధరాత్రి నుంచే భోగాపురం విమానాశ్రయం పౌర విమాన సేవలను ప్రారంభిస్తుంది. దీంతో.. విశాఖ విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోనున్నాయి.












Click it and Unblock the Notifications