సింగరేణి ప్రాంత యువతకు శుభవార్త.. మరో కొత్తగని త్వరలో ప్రారంభం!

తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మరో కొత్త గనిని చేపట్టనుంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా పరిధిలో రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేస్ టు త్వరలో ప్రారంభం కానుంది. ఈ గనిలో సుమారు 34 పాయింట్ 42 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు అంచనా.

ఈ ప్రాజెక్టు ద్వారా 18 సంవత్సరాల పాటు నిరంతరాయంగా మైనింగ్ కార్యకలాపాలు చేయవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక ఇదే విషయాన్ని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్-2 కొత్త గనిని త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు.

Ramakrishnapur Open Cast Phase-2 to Boost Singareni Coal Production said minister vivek venkataswamy

సింగరేణికి కొత్త గనులు దక్కించుకుని స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనేలా సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించామని మంత్రి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన బొగ్గు బ్లాక్‌ల వేలం బిల్లుకు మద్దతు ఇచ్చినా సింగరేణిని వేలంలో పాల్గొనకుండా అడ్డుకుందని ఆరోపించారు.

దాంతో గత పదేళ్లలో సింగరేణికి ఒక్క కొత్త బొగ్గు గని కూడా దక్కలేదని విమర్శించారు. రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్-2 గని ప్రారంభమైతే అదనపు బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పటికే ఉన్న గనుల నుంచి మిగిలిన బొగ్గును వెలికితీసే అవకాశం ఉంది. ఈ గని ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీలో భారీ వర్షాలతో పలు విమానాలు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. ప్రయాణికులకు అలెర్ట్!
ఏపీలో భారీ వర్షాలతో పలు విమానాలు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. ప్రయాణికులకు అలెర్ట్!

సింగరేణి స్థలాల్లో కార్మికులు కట్టుకున్న ఇళ్లకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. సింగరేణి గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలని, కొత్త గనులు, కొత్త ఉద్యోగాల ద్వారా సంస్థను బలోపేతం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. అటవీ అనుమతులు వచ్చిన వెంటనే గని పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు బొగ్గు ఉత్పత్తి పెరిగితే విద్యుత్ రంగం, పరిశ్రమలకు మేలు జరుగుతుందన్నారు. సింగరేణి లాభాలు పెరిగి కార్మికుల సంక్షేమం మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+