Viral Video: బోనం ఎత్తడంపై ట్రోలింగ్.. లైవ్ లోనే బోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి..

టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా అనగానే చాలా మందికి ఆమె నటించిన జాతి రత్నాలు సినిమానే గుర్తుకొస్తుంది. 2021 లో ఈ మూవీతోనే ఆమె చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో ఓ చిన్న పాత్ర చేసింది. 2022 లో బంగర్రాజు, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు, మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి, గాయపడ్డ సింహం తదితర సినిమాల్లో ఆమె నటించారు. ఇప్పుడు వల్లి మయిల్ అనే సినిమలో నటిస్తున్నారు. ఇక జాతి రత్నాలు మూవీలో చిట్టి పాత్రతో అందరికీ దగ్గరయ్యారు నటి ఫరియా అబ్దుల్లా..

అయితే ఇటీవల హైదరాబాద్‌ లో ఘనంగా జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 10న మీరాలమ్ మండిలోని శ్రీ మహంకాళేశ్వర అమ్మవారి ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాలకు నటి ఫరియా హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆమె.. బోనం ఎత్తుకుని భక్తులతో కలిసి డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యం చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫరియా అబ్దుల్లా తెలంగాణ సంస్కృతిని గౌరవించి బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకోవడంపై నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు.

అయితే మరికొందరు మాత్రం ఆమెపై ట్రోలింగ్ చేశారు. ఆమె ముస్లిం నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా కామెంట్స్ పెట్టారు. ఆమెపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే వీటన్నింటికీ సమాధానమిస్తూ ఆమె ఇన్‌ స్టాగ్రామ్ వేదికగా వీడియో పెట్టారు. అందులో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతమవుతూ ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

FariaAbdullah actress broke down wept bitterly during a live session unable to bear the trolling

ఈ వీడియోలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. "మా నాన్నఇస్లాం మతాన్ని ఇష్టపడి అందులోకి మారారు. ఒక మతంలోని మంచిని చూసి స్వీకరించిన వ్యక్తి నన్ను పెంచినప్పుడు, నా పెంపకం ఎలా ఉంటుంది..? నేను ఎప్పుడూ ఇస్లాంలో ఉన్న మంచి భావనలనే చూస్తూ పెరిగాను. నన్ను ద్వేషిస్తూ.. కాఫిర్ అని తిడుతున్న వారికి కూడా నేను మంచి జరగాలనే కోరుకుంటున్నాను. నాకు ప్రకృతిలోని చెట్లు, రాళ్లు, సీతాకోకచిలుకలు.. ఇలా ప్రతి అణువులోనూ ప్రాణం, దైవత్వం కనిపిస్తాయని నమ్ముతాను. సృష్టి అందాలు ప్రజలను మరింత దగ్గర చేయాలే తప్ప విభజించకూడదు.. అని భావోద్వేగానికి గురయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+