ఈ గింజల నీటితో మధుమేహం నియంత్రణ- గుండె.. పేగుల ఆరోగ్యానికి బెస్ట్..!!
ఆరోగ్యానికి సబ్జా గింజలు మేలు చేస్తాయి. సబ్జా వినియోగం ద్వారా ఆరోగ్య పరంగా ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. గ్లాసు నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను కలుపుకుని తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. కాగా.. సబ్జా గింజలు మధుమేహం నియంత్రణతో పాటుగా గుండె.. పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అధిక వేడితో ఇబ్బంది పడేవారు రోజుకు మూడు సార్లు నానబెట్టిన సబ్జా గింజల నీళ్ళు తాగడం వలన వేడి నుండి రిలీఫ్ లభిస్తుంది. అయితే.. సబ్జా గింజలు ఎలా తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.
సబ్జా గింజలతో అనేక సమస్యలకు పరిష్కారం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సబ్జా గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువుతో బాధపడేవారికి సబ్జా గింజలు ఒక అద్భుతమైన డైట్ టిప్. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తీసుకున్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది అనవసరమైన ఆకలిని తగ్గించి, తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది, తద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాలలో లేదా నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను తీసుకుంటే, మరుసటి రోజు ఉదయం జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఇది కడుపులో మంట, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. మధుమేహం ఉన్న రోగులకు సబ్జా గింజలు చాలా మేలు చేస్తాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటాయి.

నిపుణుల సూచనలు
అదే విధంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యుల సలహాతో వీటిని తీసుకోవడం మంచిది. సబ్జా గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముడతలు పడకుండా, మొటిమలు రాకుండా నిరోధిస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. సబ్జా గింజల్లో పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు నీటిలో వేయాలి. అందులో నిమ్మరసం, తేనె వేసి బాగా కలపాలి. చలవ కోసం పైన పుదీనా ఆకులు వేసి చల్ల చల్లగా తీసుకోవటం ద్వారా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. సబ్జా గింజలతో చేసే డ్రింక్ శరీరానికి గంటల తరబడి హైడ్రేషన్ అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.













Click it and Unblock the Notifications