CBSE Board Exams 2026: బోర్డు పరీక్షలకు సీబీఎస్ఈ కీలక నిబంధనలు-10 దాటితే..!
ఈ ఏడాది సీబీఎస్ఈ బోర్డు పరీక్షలకు (CBSE Board Exams 2026) హాజరయ్యే విద్యార్ధుల కోసం సీబీఎస్ఈ బోర్డు నిబంధనల్ని విడుదల చేసింది. పరీక్షలు రాసే వేళ విద్యార్ధులు వీటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులూ ఉండవని బోర్డు స్పష్టం చేసింది. ఇందులో ఉదయం 10 గంటల తర్వాత పరీక్షకు హాజరైతే అనుమతించబోమని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ విద్యార్ధులకు బోర్డు పెట్టిన నిబంధనలు ఏంటో ఓసారి చూద్దాం..
సీబీఎస్ఈ విద్యార్ధులకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న ఉదయం షిఫ్ట్ పేపర్లకు ఉదయం 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశం అనుమతించబడదని పరీక్షల కంట్రోలర్ డాక్టర్ సంయమ్ భరద్వాజ్ తెలిపారు. ప్రశ్నాపత్రాలు ఉదయం 10:15 గంటలకు పంపిణీ చేస్తామని, పరీక్ష ఖచ్చితంగా కేటాయించిన వ్యవధి ప్రకారం ముగుస్తుందని పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం అదనపు సమయం ఇస్తారు. పరీక్షా హాలులో విద్యార్థులు సమయాన్ని ట్రాక్ చేయడంలో సాయం చేసేందుకు వివరణాత్మక పరీక్షా రోజు "బెల్ షెడ్యూల్"ను కూడా ఇచ్చారు. కీలక సమయాల్ని తెలుసుకునేందుకు ఒక ప్రత్యేకమైన, లాంగ్ బెల్ ఉంటుంది. పరీక్షా సమయం ముగియడానికి 10 నిమిషాలు మిగిలి ఉన్నప్పుడు ఒకే బెల్, పరీక్ష ముగింపును సూచించడానికి లాంగ్ బెల్ కొడతారు.

అలాగే విద్యార్థులు పరీక్షా రోజుకు ముందే పరీక్షా కేంద్రాలను సందర్శించాలని సీబీఎస్ఈ సూచించింది. స్థానిక పరిస్థితులు, ట్రాఫిక్, వాతావరణం, దూరాన్ని పరిగణనలోకి తీసుకుని విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరుతోంది. ఈ మేరకు స్కూల్స్ తల్లిదండ్రులు, విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని తెలిపింది. అయితే పరీక్షలో ప్రశ్నపత్రం చదివే 15 నిమిషాల సమయంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని బోర్డు సూపరింటెండెంట్లను కోరింది.












Click it and Unblock the Notifications