central bank:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్..!
బ్యాంక్ ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 24 ఐటీ ఆఫీసర్స్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే, అందుకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్, చివరి తేదీ ఎప్పుడు? వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఎవరు అర్హులు: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ- ఐటీ/ఎంబీఏ
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 15/01/2025
అప్లికేషన్ చివరి తేదీ : 26/01/2025
ఇంటర్వ్యూ తేదీ: 2025 ఫిబ్రవరి మొదటివారం
సెంట్రల్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ లో మొత్తం 14 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వయోపరిమితి 23 నుంచి 35 సంవత్సరాలుగా ఉంది. మరికొన్ని ఉద్యోగాలకు వయోపరిమితి 40 సంవత్సరాలుగా పేర్కొంది.

అప్లికేషన్ ఫీజు :
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. SC, ST, దివ్యాంగులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ ప్రాసెస్ : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లోకి వెళ్లి.. రిక్రూట్ మెంట్ అనే అంశంపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థి వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత పేమెంట్ కు వెళ్లాలి. దీంతో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.












Click it and Unblock the Notifications