5,8 తరగతులపై కేంద్రం కీలక నిర్ణయం-తప్పనిసరిగా పాస్ కావాల్సిందే..!

జాతీయ విద్యావిధానం అమల్లో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలల్లో సంస్కరణలు చేపడుతున్న కేంద్రం.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా స్కూళ్లలో 5, 8 క్లాసులు చదువుతున్న విద్యార్ధులకు వర్తించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇకపై ఈ రెండు తరగతుల విద్యార్ధులు తప్పనిసరిగా పాస్ కావాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.

దేశంలోని కేంద్ర ప్రభుత్వ స్కూళ్లలో ప్రస్తుతం అమలవుతున్న నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. నో డిటెన్షన్ విధానంలో భాగంగా ఇప్పటివరకూ విద్యార్ధులు 5, 8 తరగతుల్లో పాస్ కాకపోయినా హాజరు ఆధారంగా తర్వాతి తరగతులకు ప్రమోట్ అవుతున్నారు. దీని వల్ల విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నట్లు గుర్తించిన కేంద్రం.. ఇకపై ఈ రెండు తరగతుల విద్యార్ధులు వార్షిక పరీక్షల్లో పాస్ కావాల్సిందేనని తేల్చిచెప్పేసింది. అలా పాస్ కాని వారిని ఏం చేయాలన్న దానిపైనా మార్గదర్శకాలు ఇచ్చింది.

centre cancels no detention policy in schools as per education policy- here are details

అన్ని పాఠశాలల్లో 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని తెలిపిన కేంద్రం.. . ఫెయిలైన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం ద్వారా ఈ విధానం అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లతో పాటు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ స్కూళ్లకూ ఇది వర్తించబోతోంది. దీంతో ఇకపై ఆయా స్కూళ్లలో చదివే 5,8 తరగతుల విద్యార్దులు ఎట్టి పరిస్ధితుల్లోనూ పాస్ కాక తప్పని పరిస్దితి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+