అగ్నివీర్ నియామకాలు: తెలంగాణలో నాలుగు కేంద్రాలు
హైదరాబాద్: అగ్నివీర్ ల నియామక అర్హత పరీక్ష కోసం తెలంగాణలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు వివరాలను ఆర్మీ నియామక అధికారి కీట్స్ కె దాస్ తెలిపారు. హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్‌లలో పరీక్ష కేంద్రాలుంటాయి. అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాతనే ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ అవుతాయి.

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పథకమే అగ్నిపథ్. దీని కింద నిర్వహించే నియామక పరీక్ష కోసం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఏప్రిల్ 17 నుంచి అగ్నివీర్ ప్రాథమిక అర్హత పరీక్ష జరగనుంది.
కాగా, ఐటీఐ లేదా పాలిటెక్నిక్ విద్యార్థులకు 20 నుంచి 50 మార్కుల వరకు బోనస్ వస్తాయి. అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. మొదట ప్రాథమిక పరీక్ష ఆన్‌లైన్లో, ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ప్రాథమిక పరీక్షలో అర్హులకు ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహిస్తారు.
దేహదారుఢ్య పరీక్షలో అభ్యర్థులకు మెడికల్ టెస్టులు ఉంటాయి. మెడికల్ టెస్ట్ లోనూ అర్హత సాధించినవారు అగ్నివీరులుగా ఎంపికవుతారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే వాట్సాప్ నెంబర్ 79961 57222 కు తెలియజేసి సమాధానాలు పొందవచ్చు.












Click it and Unblock the Notifications