ఐఐటీ బాంబే టాపర్ నిర్ణయం: 2.9 కోట్ల ప్యాకేజీ కాదని కిరాణా కొట్లో.. అసలు నిజం తెలిస్తే కన్నీళ్లే!

ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి, కోట్ల రూపాయల ప్యాకేజీతో విదేశాల్లో స్థిరపడటం ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థుల కల. కానీ, కాన్పూర్‌కు చెందిన వివేక్ శర్మ అనే ఐఐటీ గోల్డ్ మెడలిస్ట్ మాత్రం తన జీవితంలో అత్యంత భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ నుంచి వచ్చిన సుమారు రూ. 2.9 కోట్ల వార్షిక వేతన ఆఫర్‌ను తిరస్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఐఐటీ బోంబే టాపర్ (IIT Bombay)

వివేక్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి రైల్వే క్లర్క్‌గా పని చేయగా, తల్లి ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. కొడుకు చదువు కోసం వారు తమ పొదుపు మొత్తాన్ని ఖర్చు చేశారు. చివరకు ఐఐటీ బాంబేలో సీటు సాధించి గోల్డ్ మెడల్ సాధించిన వివేక్, విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రికి గుండెపోటు రాగా, తల్లి క్యాన్సర్ బారిన పడ్డారు.

JEE రాయకుండానే 14 మందికి IIT సీట్లు..! ఎలాగంటే?
JEE రాయకుండానే 14 మందికి IIT సీట్లు..! ఎలాగంటే?

యూఎస్ ఆఫర్ కంటే తల్లితండ్రులే ముఖ్యం

ఆ క్లిష్ట పరిస్ధితుల్లో అమెరికా వెళ్లడం కంటే తల్లిదండ్రుల పక్కన ఉండటమే ముఖ్యమని ఆయన భావించారు. వీసా ఇంటర్వ్యూను రద్దు చేసుకుని కాన్పూర్‌లోనే ఉండిపోయారు. కుటుంబ పోషణ కోసం ఇంటి కిందే 'శర్మ జనరల్ స్టోర్' పేరుతో ఒక చిన్న కిరాణా దుకాణాన్ని ప్రారంభించారు. ఐఐటీ టాపర్ కిరాణా షాపు నడపడంపై కొందరు విమర్శలు చేసినా, ఆయన మాత్రం తన కర్తవ్యాన్నే నమ్ముకున్నారు. పగలు దుకాణం చూసుకుంటూ, రాత్రి వేళల్లో ఫ్రీలాన్స్ సాఫ్ట్‌వేర్ పనులు చేసేవారు.

IIT Bombay gold medalist running local grocery store

అదే కంపెనీ వర్క్ ఫ్రమ్ హోం ఆఫర్

కిరాణా దుకాణం నడుపుతూనే, స్థానిక పేద పిల్లలకు ఉచితంగా కోడింగ్ నేర్పించడం ప్రారంభించారు. వివేక్ ప్రతిభ, ఆయన సేవా దృక్పథం గురించి తెలుసుకున్న అదే అమెరికా కంపెనీ, ఈసారి ఆయనను తమ దేశానికి రమ్మని కోరలేదు. బదులుగా, కాన్పూర్‌ నుంచే రిమోట్ పద్ధతిలో విద్యా సంబంధిత ప్రాజెక్ట్‌లకు సేవలందించే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఆయన తన ఊరిలోనే ఉంటూ తల్లిదండ్రుల సంరక్షణతో పాటు సాఫ్ట్‌వేర్ రంగాన్ని సమన్వయం చేసుకుంటున్నారు.

32 లక్షల జీతం వద్దనుకున్న ఐఐటీ గ్రాడ్యుయేట్.. ! రీజన్ తెలిస్తే షాక్..!
32 లక్షల జీతం వద్దనుకున్న ఐఐటీ గ్రాడ్యుయేట్.. ! రీజన్ తెలిస్తే షాక్..!

మానవతా విలువలకు సజీవ సాక్ష్యం

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వివేక్ శర్మ కథనం నేటి యువతకు సరికొత్త స్ఫూర్తినిస్తోంది. "నా తల్లిదండ్రులే నా అతిపెద్ద కంపెనీ" అని ఆయన చెప్పిన మాటలు నెటిజన్ల హృదయాలను హత్తుకున్నాయి. విజయం అంటే కేవలం విదేశీ ఉద్యోగాలు, భారీ జీతాలు మాత్రమే కాదని, కష్టాల్లో ఉన్న కన్నవారికి తోడుగా నిలబడటమే అసలైన సార్థకత అని ఆయన నిరూపించారు. ఈ నిర్ణయం కెరీర్ కంటే మానవీయ విలువలకు ఇచ్చిన ప్రాధాన్యతను చాటిచెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+