రూ.1,00,000 స్కాలర్‌షిప్.. విద్యార్ధినిలకు "ఇన్ఫోసిస్ ఫౌండేషన్" గుడ్ న్యూస్ !!
భారతదేశంలోని ప్రతిభావంతులైన విద్యార్ధినిలకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ గోల్డెన్ ఆఫర్ తీసుకొచ్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను "STEM స్టార్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం"ను ప్రకటించింది.
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్ రంగాల్లో.. అండర్ గ్రాడ్యుయేట్ చదువులు కొనసాగిస్తున్న యువతులకు ఈ స్కాలర్‌షిప్ అందించనున్నారు.
ఈ స్కాలర్ షిప్ కొరకు ఎంపికైన విద్యార్థినులు తమ కోర్సు వ్యవధి మొత్తం పాటు ప్రతి సంవత్సరం రూ.1,00,000 వరకు ఆర్థిక సహాయం పొందుతారు. ఈ మొత్తం ట్యూషన్ ఫీజులు, పాఠ్యపుస్తకాలు, ల్యాబ్ ఫీజులు, హాస్టల్ ఖర్చులు వంటి అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ రకంగా సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థినులు కూడా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుకునే అవకాశం పొందుతారు.

అర్హతలు..
- ఈ స్కాలర్‌షిప్ భారతీయ మహిళా విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.
- 12వ తరగతి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి.
- NIRF గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో STEM అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో (B.Sc, B.Tech, B.E, BCA మొదలైనవి) మొదటి సంవత్సరంలో చేరి ఉండాలి.
- రెండవ సంవత్సరం B.Arch విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
- ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లేదా డ్యుయల్ డిగ్రీ కోర్సులు చేస్తున్న విద్యార్థినులు కూడా అర్హులు.
- NIRF జాబితాలో లేని ప్రభుత్వ ఇంజినీరింగ్ లేదా మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
- అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే ఎక్కువ కాకూడదు.
స్కాలర్‌షిప్ ప్రయోజనాలు..
- ఎంపికైన విద్యార్థినులు ప్రతి విద్యా సంవత్సరానికి రూ.1,00,000 వరకు ఆర్థిక సహాయం పొందుతారు.
- ఇది కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది కొనసాగుతుంది.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఈ కార్యక్రమం ద్వారా మహిళలను సైన్స్ & టెక్నాలజీ రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో ఇంజినీరింగ్, టెక్నాలజీ, సైన్స్ రంగాల్లో మహిళల శాతం ఇంకా తక్కువగా ఉంది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఆ లోటు కొంతవరకు భర్తీ చేయాలన్నదే సంస్థ ఉద్దేశంగా భావిస్తున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి సైతం గతంలో ప్రతి యువతీకి చదువు ద్వారా సాధికారత కలగాలి. STEM రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ అభివృద్ధికి దోహదం అవుతుందని పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్
దరఖాస్తు గడువు..
చివరి తేదీ: అక్టోబర్ 30, 2025
ఎంపిక ప్రక్రియ..
- స్కాలర్‌షిప్ కోసం వచ్చిన దరఖాస్తులను ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెలెక్షన్ కమిటీ పరిశీలిస్తుంది.
- అభ్యర్థుల అకాడెమిక్ మెరిట్, ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్, మరియు మోటివేషన్ లెటర్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- ఎంపికైన విద్యార్థులకు ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించబడుతుంది.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ www.b4s.in/sen/ISTS3 చూడవచ్చు.
సూచనలు..
దరఖాస్తు సమయంలో విద్యార్థులు తమ ఆధార్ కార్డ్, విద్యా సర్టిఫికేట్లు, ఇన్కమ్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి పత్రాలను అప్‌లోడ్ చేయాలి. సామాన్య కుటుంబాలకు చెందిన ప్రతిభావంతమైన మహిళా విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications