నేడే జేఈఈ అడ్వాన్డ్స్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల...
నేడు జేఈఈ అడ్వాన్డ్స్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. ఈ సంవత్సరం రెండు విడతల్లో నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుంది. ఇక, నేడు అంటే (మే 17వ తేదీన) ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్‌కార్డులను 2024 డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఈ నెల 26వ తేదీన ఈ పరీక్ష జరగనుంది.
జేఈఈ అడ్వాన్డ్స్ 2024 పరీక్ష మొత్తం రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 మొత్తం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్1 పరీక్ష జరుగగా, మధ్యాహ్నం షిఫ్ట్‌లో పేపర్-2 పరీక్ష 2.30 నుంచి 5.30 గంటల వరకు జరగనుంది. ఈ పరీక్షలో ర్యాంకులు పొందిన వారు దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో, ఇతర ప్రఖ్యాత సంస్థల్లో నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు https://jeeadv.ac.in/ ఈ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగలరు. మే 26వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అనంతరం జూన్ 2వ తేదీన ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేస్తారు.

ఈ ఆన్సర్ కీపై అభ్యంతరాల తెలిపేందుకు అభ్యర్థులకు జూన్ 2 నుంచి అనుమతినిస్తారు. జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్ తుది కీ తో పాటు ఫలితాలను కూడా జూన్ 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు (ఏఏటీ) అప్లయ్ చేసుకునేందుకు అర్హులు. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ-2024) రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చే నెల 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.












Click it and Unblock the Notifications