ఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు.. 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!
నిరుద్యోగులకు శుభవార్త... ఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్)లో మొత్తం 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, శారీరక దారుఢ్య వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల వివరాలు : 4,660.
కానిస్టేబుల్ మొత్తం పోస్టులు : 4,208 పోస్టులు
సబ్ ఇన్‌స్పెక్టర్ మొత్తం పోస్టులు : 452 పోస్టులు

ఇతర వివరాలు..
విద్యార్హత : కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి. ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు..
వయసు : కానిస్టేబుల్ పోస్టులకు 01.07.2024 నాటికి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సై పోస్టులకు 20-28 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు..
వేతనం : ఈ పోస్టులకు ఎంపికయిన వారికి నెలకు ఎస్సై పోస్టులకు రూ.35,400 వేతనం ఉంటుంది. కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700 శాలరీ ఉంటుంది.
దరఖాస్తు రుసుము : ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే జనరల్ అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులయితే రూ.250 చెల్లించాలి.
ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వివరాలు..
అహ్మదాబాద్,
అజ్‌మేర్,
బెంగళూరు,
భోపాల్,
భువనేశ్వర్,
బిలాస్‌పూర్,
చండీఘడ్,
చెన్నై,
గువాహటి,
జమ్ము అండ్ శ్రీనగర్,
కోల్‌కతా,
మాల్దా,
ముంబయి,
ముజఫర్‌పూర్,
పట్నా,
ప్రయాగ్‌రాజ్,
రాంచీ,
సికింద్రాబాద్,
సిలిగురి,
తిరువనంతపురం,
గోరఖ్‌పూర్.












Click it and Unblock the Notifications