కస్తుర్బా స్కూల్స్‌లో 1358 టీచర్ పోస్టులు: దరఖాస్తుల గడువు పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కస్బుర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో టీచర్ పోస్టులకు దరఖాస్తుల గడువును సమగ్ర శిక్షా సొసైటీ పొడిగించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 1358 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను మే 30 నుంచి జూన్ 5 వరకు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, దరఖాస్తుల గడువును అధికారులు జూన్ 8 వరకు పొడిగించారు.

దరఖాస్తు చేసే క్రమంలో అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురవడంతో వారి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు సమగ్ర శిక్షా సొసైటీ వెల్లడించింది.

భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు: 1358
వీటిలో ప్రిన్సిపాల్ 92 పోస్టులు ఉండగా, పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్ 846, సీఆర్డీ 374, పీఈటీ 46 చొప్పున పోస్టులు ఉన్నాయి.

 kasturba gandhi school recruitment

విద్యార్హతలు:
ఆయా ఉద్యోగాలను బట్టి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీలలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి:
జనరల్ అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల చొప్పున వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:
రూ. 100. కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు.

గౌరవ వేతనం:
ప్రిన్సిపాళ్ పోస్టులకు రూ. 34,139, సీఆర్డీలకు రూ. 26,759, పీజీటీలకు రూ. 26,759, పీఈటీలకు రూ. 26,759 చొప్పున నెలకు గౌరవ వేతనం ఉంటుంది.

ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+