LIC Jobs: ఎల్ఐసీలో కొలువులు.. దరఖాస్తు చేసుకోండిలా..
దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీలో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 300 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నియమించుకోనున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు శిక్షణ పూర్తి చేసిన వారు మూడేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. వీరికి సంవత్సరం ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దీన్ని రెండేళ్లకు కూడా పెంచే అవకాశం ఉంది. అయితే ఈ ఉద్యోగంలో చేరే వారు నాలుగేళ్లపాటు పనిచేస్తామని బాండ్ రాయాల్సి ఉంటుంది.

ఎవరికి ఎన్ని పోస్టులు
మొత్తం 300 ఏఏఓ ఖాళీల్లో ఎస్సీ-50, ఎస్టీ-27, ఓబీసీ-84, ఈడబ్ల్యూఎస్-27, అన్‌రిజర్వుడ్-112 కేటాయించారు. 01.01.2023 నాటికి అభ్యర్థుల వయసు 21-30 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల సడలింపు ఉండనుంది.

ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 60 నిమిషాల పాటు నిర్వహించే ఈ పరీక్షలో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1లో రీజనింగ్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 35 ప్రశ్నలకు 35 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి.

300 మార్కులు
ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ అభ్యర్థులకు కనీసార్హత మార్కులు 46. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 41 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రధాన పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ఈ పరీక్ష 300 మార్కులు ఉంటాయి. డిస్క్రిప్టివ్ 25 మార్కులు ఉంటాయి. ప్రధాన పరీక్షలో
అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.

ఇంటర్వ్యూ
మెయిన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. అభ్యర్థుల తుది ఎంపిక మెయిన్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూ గరిష్ఠ మార్కులు 60. ఈడబ్ల్యూఎస్, అన్‌రిజర్వుడ్, ఓబీసీ అభ్యర్థులకు కనీసార్హత మార్కులు 30. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 27 మార్కులు సాధించాలి. అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. నెగ్గిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. అందులో అర్హత సాధించిన వాళ్లను చివరిగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు
దరఖాస్తు ఫీజు రూ.700 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.85 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 31.01.2023గా ఉంది. ఫిబ్రవరి 17, 20 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్ మార్చి 18న నిర్వహించనున్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications