స్పెషల్ ట్యాగ్ లకు టీటీడీ ప్లాన్.. !!

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గడువు దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో అత్యంత వైభవంగా, కన్నుల పండువగా ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. వీటిని విజయవంతం చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి పెట్టింది. వరుస సమీక్షలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి.. తాజాగా అన్ని విభాగాల అధిపతులతో సమావేశం అయ్యారు.

తిరుమల పద్మావతి అతిథి గృహంలో ఈ సమావేశం ఏర్పాటైంది. టీటీడీ జేఈవో డాక్టర్ ఏ శరత్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం వెంకయ్య చౌదరి మాట్లాడారు. టీటీడీ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు.

Comprehensive TTD Review Meeting Held for Tirumala September Brahmotsavams Smooth Darshan

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి- తిరుమల మధ్య ఆర్టీసీ బస్సుల సంఖ్యను ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా పెంచాలని సూచించారు. వాహనాల పార్కింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే పార్కింగ్ స్థలాలను కేటాయించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వాటి నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని చెప్పారు. చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్‌ల పంపిణీని విస్తృతంగా చేపట్టాలని చెప్పారు.

వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు
వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు

విద్యుత్ సరఫరా, వాటి కేబుళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గరుడ వాహనం, చక్రస్నానం రోజున అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు. అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత వెంకయ్య చౌదరి చెప్పారు.

నాగ పంచమి ఎప్పుడు, ఏ రోజున జరుపుకోవాలి
నాగ పంచమి ఎప్పుడు, ఏ రోజున జరుపుకోవాలి

అనంతరం జేఈవో శరత్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. శ్రీనివాసం, విష్ణునివాసం, ఇతర ధర్మసత్రాల్లో వసతి గదుల నిర్వహణ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వివరించారు. బ్రహ్మోత్సవాల్లో 25 రాష్ట్రాలకు చెందిన కళా బృందాలతో పాటు సింగపూర్, జర్మనీ నుండి కూడా కళా బృందాలు విచ్చేసేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+